logo
జాతీయం

అంతులేని నిధి ఉందట.. అనంతమైన సంపద దాగి ఉందట

Highlights

దట్టమైన అటవీ ప్రాంతం. చుట్టు ఎత్తయిన కొండలు. చుట్టూ చూస్తే లోతెంతో తెలియని లోయలు. అడవి మధ్యలో కొలువుదీరిన కోట. ...

దట్టమైన అటవీ ప్రాంతం. చుట్టు ఎత్తయిన కొండలు. చుట్టూ చూస్తే లోతెంతో తెలియని లోయలు. అడవి మధ్యలో కొలువుదీరిన కోట. ఇప్పుడిప్పుడే పర్యాటకమవుతున్న ఊహకందని రహస్యాల మూట. ఇదీ సూక్ష్మంగా కాంగ్రాకోట రహస్యం.

అంతులేని నిధి ఉందట..అనంతమైన సంపద దాగి ఉందట..కోట గోడల ప్రాకారాలు... శిథిలమైన స్తంభాలు.. కాంగ్రా కోట చెప్పే నిజమేంటి?.. అందరు అనుకుంటున్నట్టుగా అక్కడ అంతులేని నిధి ఉందా?
అంతులేని సంపదను సర్పాలే సంరక్షిస్తున్నాయా?

సుమారు ఐదు వందల ఏళ్ల కిందట నిర్మితమైన కోటలో అంతులేని రహస్యాలు దాగి ఉన్నాయి. కోట గోడ ప్రాకారాలు ప్రాకారాల మధ్యలో శిథిలమైన స్థంభాలు వాటి మధ్యలో ఎత్తయిన కోటగోడలు. కాంగ్రాకోట రహస్యాలు చెప్పే నిజాలేంటి? జనావాసానికి మధ్యలో వెలసిన ఈ కోట గురించి ఎన్నోసార్లు ఎన్నో చర్చలు జరిగినప్పటికీ కచ్చితమైన జవాబు ఏదీ ఇప్పటి వరకు లభించకపోవడమే అసలుసిసలు సీక్రెట్‌. హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో కొలువుదీరిన కాంగ్రాకోట మరోసారి చర్చలకు కారణమైంది.

కోండపై కోట కోట చుట్టూ ఏడు దర్వాజాలు మరుగునపడిన ప్రాచీన నిర్మాణం ఇప్పుడు పర్యాటక ప్రాంతమైంది. కంటికి కనిపించని గొలుసు జలశయాలు పరిశోధనలకు కూడా అంతుచిక్కని రాతిగోడ చరిత్ర కాంగ్రకోటలో కనిపించే అద్భుతాలు. కానీ మన కంటికి కనిపించని అద్భుతాలు విచిత్రాలు లెక్కలేనన్ని.
ఒక కోట... నిధుల ఊట.... ఎన్నో రహస్యాల మూట..ఎటు చూసినా అద్భుతాలే... కంటికి కనిపించే విచిత్రాలే!!..కాంగ్రాకోటలో దాగిన ఆ సీక్రెట్‌ ఏంటి? ఆ మిస్టరీ ఏంటి?

ఒకప్పడు దట్టమైన అడవుల మధ్య కొలువుదీరిన కాంగ్రాకోటను ఏడు దర్వాజలతో అద్భుతంగా నిర్మించారు. నలుదిక్కుల నుంచి ఎలా చూసినా కాంగ్రా కోట కంటికి నిజమైన అద్భుతమే. సుందరమైన ప్రకృతి ఒడిలో అందమైన ఈ కట్టడంపై అనేక మంది పరిశోధనలు చేసినా దాని రహస్యం మాత్రం అంతుపట్టడం లేదు.

కోట చుట్టూ ఉన్న రాతి గోడ సుమారు 30కిలోమీటర్ల మేర విస్తరించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ రాతిగోడ దాటి లోపలికి వెళ్తే విశాలమైన ప్రదేశం కనిపిస్తుంది. ఇక్కడే ఓ కోనేరు ఉన్నట్లుగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. దానికి ఆధారంగా సింహం నోటి నుంచి 24 గంటలు 365 రోజులు నిరంతరాయంగా వచ్చే స్వచ్ఛమైన మంచినీరే నిదర్శనం.

ఈ కొండపై నుంచి నలుదిక్కులా కదలికలు ఎక్కడ ఉన్నా కనిపించే విధంగా ఏర్పాట్లు చేశారు. కోట నుంచి ఎటువైపు నుంచి ఏ కదలికలు కనిపించినా చాలా సులువుగా గుర్తించేందుకు కోట పైభాగం అనువుగా కనిపిస్తుంది. కోటపైకి దాడికి వచ్చే శత్రుమూకల కదలికలు గుర్తించేలా కోట నిర్మితమైంది. ఇక కోట లోపల ఆశ్చర్యపరిచే ఆనవాళ్లు ఎన్నో కనిపిస్తాయి. సహజ సరిహద్దులుగా ఉన్న దట్టమైన అడవి, చుట్టుపక్కల ఎత్తయిన కొండలు కోటకు రక్షణగా నిలిచాయి.

కాంగ్రా కోటలో అంతులేని సంపద దాగి ఉందన్నది ఓ నమ్మకం. అంతులేని నిధిని దక్కించుకోవడానికి సాగించిన వేటను ఉదాహరణగా చెబుతారు స్థానికులు. అసలు నిజంగానే కోట కింద నిధి ఉందా? అంతులేని సంపద దాగి ఉందా? ఆ సంపదను సర్పాలు సంరక్షిస్తున్నాయా?

కాంగ్రాకోటలో అంతులేని నిధి నిక్షేపాలు.. కోటలో ఓ రాయి కింద నిధి ఉందా?..కోటంతా కలియతిరిగినా ఆ రాయి జాడ దొరకదా?..ఒళ్లంతా కళ్లు చేసుకొని చూసినా దాని ఆచూకీ తెలియదా?..కోట కింద అనంత సంపద ఉందన్నది ఓ నమ్మకం.. అంతులేని ఆ నిధిని సర్పాలే సంరక్షిస్తాయన్నది ఓ విశ్వాసం

కాంగ్రాకోటలో అంతులేని నిధి నిక్షేపాలు ఉన్నాయంటారు స్థానికులు. ఎకరాల కొద్దీ స్థలంలో విస్తరించిన ఈ కోటలో ఇన్నేళ్లయినా నిధి జాడ తెలుసుకోలేకపోతున్నామన్న అభిప్రాయలూ ఉన్నాయి. కోటలో ఓ భాగాన, ఓ మూలన ఓ రాయి కింద నిధిని నాటి రాజులు దాచి పెట్టారని చెబుతారిక్కడి స్థానికులు.

అనంత పద్మనాభస్వామి దేవాలయంలో ఆరో గదికి నాగబంధం ఉన్నట్టే ఇక్కడ కూడా అలాంటి బంధమే ఉందన్నది స్థానికంగా ఓ నమ్మకం. కాకపోతే అది మంత్రించి దిగ్బంధించిన నాగ బంధం కాదని, సాక్షాత్తూ ఓ సర్పమే అంతులేని నిధికి సంరక్షణగా ఉందని చెబుతారు. 250 సంవత్సరాలుగా ఆ నిధిని ఆ సర్పం కాపాడుతుందంటున్నారు ఇక్కడి వారు.

ఏమైనా కాంగ్రాకోట కనిపించే అద్భుతైమన కట్టడమే కాదు మన కంటికి కనిపించని అంతులేని నిధి నిక్షేపాల గని. ఒకప్పుడు పర్యాటకానికి దూరంగా ఉన్న ఈ కాంగ్రాకోట ఇప్పుడు టూరిస్టు స్పాట్‌గా మారింది. ఏ ఏటికాయేడు టూరిస్టులతో, దేశ విదేశీ పర్యాటకులతో కాంగ్రాకోట కళకళలాడుతోంది.

Next Story