నెంబర్ షేర్ చేసిన భర్తకు కాజోల్ వార్నింగ్!

బాలీవుడ్ నటుడు అజయ దేవగన్ సోషల్ మీడియాలో చేసిన చిన్న పొరపాటు చివరకు తన భార్య కాజోల్ చేత చివాట్లు తినేవరకు...
బాలీవుడ్ నటుడు అజయ దేవగన్ సోషల్ మీడియాలో చేసిన చిన్న పొరపాటు చివరకు తన భార్య కాజోల్ చేత చివాట్లు తినేవరకు వెళ్లింది. అంతేకాదు ట్విట్టర్ సాక్షిగా అజయ్ దేవగన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నీ వేషాలేమైనా ఉంటే ఇంటి బయట వరకు ఒకే, ఒక వేళ ఇంట్లోకి నీ పైత్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు అని తేల్చి చెప్పింది. సోమవారం అజయ్ తన భార్య కాజోల్‌ను కోట్ చేస్తూ ఓ ట్వీట్ చేశాడు. కాజోల్ ప్రస్తుతం విదేశాల్లో ఉంది. ఆమెతో మాట్లాడాలనుకుంటే ఈ వాట్సాప్ నంబర్‌కు మెసేజ్ చేయండి అని ట్వీట్ చేస్తూ ఓ నంబర్‌ను పోస్ట్ చేశాడు.
దాంతో చాలా మంది నెటిజన్లు ఆ నంబర్‌కు తెగ మెసెజ్‌లు పెట్టారు. కానీ కాజోల్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దాంతో కాజోల్ మాకు ఎలాంటి రిప్లై ఇవ్వడం లేదంటూ అజయ్ దేవ్‌గణ్‌కు వరుసగా ట్వీట్లు చేశారు. దీనిపై అజయ్ స్పందిస్తూ...‘సెట్స్‌లో ఫ్రాంక్ చేయడం పాత పద్దతి. కొంచెం వెరైటీగా మీతో ఫ్రాంక్ ప్లే చేశానంటూ అభిమానులకు ట్వీట్ చేశాడు. అజయ్ ప్రాంక్ వైరల్ కావడంతో కాజోల్ జోక్యం చేసుకుంది. సోషల్ మీడియా ద్వారా భర్తకు వార్నింగ్ ఇచ్చింది. `మీ ప్రాంక్‌లు ఇప్పుడు సినిమా సెట్స్‌లను, స్టూడియోలను కూడా దాటి వెళ్లిపోయాయ్. కానీ, ఇంట్లో ఇలాంటి వేషాలు కుదరవు` అని భర్తకు కాజోల్ సరదాగా వార్నింగ్ ఇచ్చింది.
Looks like your pranks are out of the studios now... But there is No Entry for them at home! https://t.co/BJsBKW5jjD
— Kajol (@KajolAtUN) September 25, 2018
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMTఉక్రెయిన్ కథ ముగిసిపోయిందంటున్న రష్యా.. పుతిన్ తర్వాతి టార్గెట్ ఆ...
27 May 2022 2:00 PM GMTKarimnagar: అక్రమ వడ్డీలకు యువకుడి బలి
27 May 2022 1:30 PM GMT