logo
సినిమా

`అక్కా` అని పిలిచి కాజ‌ల్‌కు షాకిచ్చిన అభిమాని!

X
Highlights

టాలీవుడ్ లో గత కొంత కాలంగా హాట్ చందమామ అని పిలవబడే కాజల్ అగర్వాల్ అంటే అభిమానులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా...

టాలీవుడ్ లో గత కొంత కాలంగా హాట్ చందమామ అని పిలవబడే కాజల్ అగర్వాల్ అంటే అభిమానులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెండితెరపై కనిపించినా బయట కనిపించినా అమ్మడి అందంలో పెద్దగా తేడా ఉండదు. దీంతో కుర్రకారు ఆమె ఏదైనా సినిమా వేడుకలకి రాబోతోందంటే చాలు ఎగబడి మరి వెళతారు. స్టార్ హీరోలు పక్కన ఉన్నా కూడా కాజల్ వైపు తెలియకుండా కళ్లు వెళ్లడం కామన్.

అలాంటి కాజల్ అంటే అందరికి కలల రాకుమారే. అయితే ఆమె అందం గురించి తెలిసిన వారు ఎవరైనా సరే సిస్టర్ అని అనరు. కానీ రీసెంట్ గా ''అ!'' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక అభిమాని మాత్రం కాజల్ ని అక్కా అని అనేశాడు. దీంతో కాజ‌ల్‌తోపాటు అంద‌రూ షాక‌య్యారు. ఆ అభిమాని వెంట‌నే కాజ‌ల్‌కు `ఐ ల‌వ్యూ` చెప్పాడు. దీంతో మ‌రోసారి అంద‌రూ షాక‌య్యారు. `ఓ వైపు `అక్కా` అని పిలిచి మ‌ళ్లీ `ఐల‌వ్యూ` అని ఎలా చెబుతున్నావ‌`ని కాజ‌ల్ అడిగింది. దీంతో అతిథులంతా న‌వ్వుకున్నారు.

Next Story