Top
logo

యూ ట్యూబ్ ను షేక్ చేస్తోన్న' కాలా'

X
Highlights

‘నేనొక్కడినే వచ్చాను. దమ్మున్నోడు రండిరా. మీరింకా నా పూర్తి రౌడీయిజాన్ని చూడలేదు’ అంటూ.. తమిళ సూపర్ స్టార్...

‘నేనొక్కడినే వచ్చాను. దమ్మున్నోడు రండిరా. మీరింకా నా పూర్తి రౌడీయిజాన్ని చూడలేదు’ అంటూ.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కాలర్ ఎగరేశాడు. అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న తన కొత్త సినిమా టీజర్ ను జనాల్లోకి వదిలేశాడు. త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేసి సినిమాలను వదిలేయబోతున్న రజనీకాంత్.. ఈ సినిమాను ఫ్యాన్స్ కు విజువల్ ఫీస్ట్ గా రూపొందించినట్టు టీజర్ చూస్తే అర్థం అవుతోంది.

ఇంకా అదే స్టయిల్.. ఇంకా అదే పంచ్.. తన స్టామినాకు తగిన డైలాగ్స్ తో.. రజనీ విజిల్స్ వేయించాడు. బాలీవుడ్ నటి హుమా ఖురేషి.. రజనీకి జంటగా నటించింది. నానా పటేకర్ విలన్ గా స్పెషల్ అట్రాక్షన్ కానున్నాడు. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాంబినేషన్ తోనే కేక పుట్టించిన ఈ సినిమా.. ఇప్పుడు టీజర్ తో కూడా.. అదరగొట్టింది.

వాస్తవానికి గురువారమే టీజర్ విడుదల కావాల్సి ఉన్నా కూడా.. కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మరణంతో.. వాయిదా పడింది. శుక్రవారం అలా విడుదల కాగానే.. యూ ట్యూబ్ ను షేక్ చేసేస్తోంది. దటీజ్ రజనీ అనిపిస్తోంది.

Next Story