logo
సినిమా

కాలా మూవీ రివ్యూ

కాలా మూవీ రివ్యూ
X
Highlights

నిర్మాణ సంస్థ‌లు: వ‌ండ‌ర్ బార్ ఫిలిమ్స్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ తారాగ‌ణం: ర‌జనీకాంత్‌, నానా ప‌టేక‌ర్‌, హ్యూమా...

నిర్మాణ సంస్థ‌లు: వ‌ండ‌ర్ బార్ ఫిలిమ్స్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్‌
తారాగ‌ణం: ర‌జనీకాంత్‌, నానా ప‌టేక‌ర్‌, హ్యూమా ఖురేషి, ఈశ్వ‌రీరావు, స‌ముద్ర‌ఖ‌ని, అంజ‌లి పాటిల్‌, అర‌వింద్ ఆకాశ్‌, షాయాజీ షిండే త‌దిత‌రులు
మాట‌లు: శ్రీరామ‌కృష్ణ‌
పాట‌లు: చ‌ంద్ర‌బోస్‌, వ‌న‌మాలి
సంగీతం: స‌ంతోశ్ నారాయ‌ణ్‌
ఛాయాగ్ర‌హ‌ణం: ముర‌ళి.జి
కూర్పు: శ్రీక‌ర్ ప్ర‌సాద్‌
నిర్మాత‌: ధ‌నుశ్‌
ద‌ర్శ‌క‌త్వం: పా.రంజిత్‌

సూపర్ స్టార్ రజినీకాంత్, పా. రంజిత్ కాంబోలో తెరకెక్కిన ‘కాలా’ మూవీ భారీ అంచనాల నడుమ గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వండర్ బార్ ఫిలింస్ పతాకంపై రజినీ అల్లుడు ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మించడంతో ఈ చిత్రానికి మరింత హైప్ వచ్చింది. ఇక గతంలో కబాలి చిత్రాన్ని రూపొందించిన పా. రంజిత్‌కే మరోసారి అవకాశం ఇచ్చారు రజినీ. మరి రజినీ నమ్మకాన్ని పా. రంజిత్ నిలబెట్టాడా? రజినీ పొలిటికల్ ఎంట్రీ తరువాత వచ్చి ‘కాలా’ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? భారీ అంచ‌నాలు న‌డుమ విడుద‌లైన కాలా ఎలా ఉంది? స‌గ‌టు సినీ అభిమానికి న‌చ్చుతుందా? లేదా? అని తెలుసుకోవాలంటే సినిమా క‌థంటో చూద్దాం.

క‌థ‌:
తిరున‌ల్ వేలికి చెందిన యువ‌కుడు క‌రికాల‌న్‌(ర‌జ‌నీకాంత్‌) కొన్ని ప‌రిస్థితుల కార‌ణంగా ముంబై న‌గ‌రంలోని ధారావి ప్రాంతానికి చేరుకుంటాడు. అక్క‌డ ప్ర‌జ‌ల క‌ష్ట సుఖాల్లో వారికి అండ‌గా నిల‌బ‌డి వారి నాయ‌కుడుగా ఎదుగుతాడు. అక్క‌డే జ‌రీనా(హ్యూమా ఖురేషి)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు(ప్లాష్ బ్యాక్ ఏపిసోడ్‌).. కానీ ఒక్క‌టి కాలేక‌పోతారు. చివ‌ర‌కు కాలా సెల్వి(ఈశ్వ‌రీరావు)ను పెళ్లి చేసుకుంటాడు. ధారావి ప్రాంతం పేద ప్ర‌జ‌ల‌కు చెందింది. అక్క‌డున్న హిందూ ముస్లింలు అన్న‌ద‌మ్ముల్లా క‌లిసి మెలిసి ఉంటారు. అయితే ఆ ప్రాంతాన్ని ఆధీనం చేసుకోవాల‌ని హ‌రినాథ్ దేశాయ్‌(నానా ప‌టేక‌ర్‌) వంటి రాజ‌కీయ నాయ‌కుడు ప్ర‌య‌త్నిస్తాడు. అయితే ఉన్న చోటును వ‌ద‌లి పేద ప్ర‌జ‌ల ఎక్క‌డికి పోతారు. అందువ‌ల్ల వారు కాలా నాయ‌క‌త్వంతో ఎదురుతిరుగుతారు. అనుక‌న్న ప‌ని కాక‌పోతే మ‌న రాజ‌కీయ నాయ‌కులు ఊరుకుంటారా? అక్క‌డి మ‌నుషుల మ‌ధ్య గొడ‌వ‌లు సృష్టిస్తారు. అప్పుడు కాలా ఏం చేస్తాడు? త‌న ప్రాంత ప్ర‌జల‌ను ఒక్క‌టి చేసే ఎలా పోరాడుతాడు? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్ల‌స్ పాయింట్స్‌:
సినిమాకు ప్ర‌ధాన బ‌లం అంటే ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంతే. రెండేళ్లు(క‌బాలి) త‌ర్వాత ర‌జ‌నీకాంత్ చేసిన కాలా..ఆయ‌నకు రాజ‌కీయంగా స‌పోర్ట్ చేసేలా తెర‌కెక్కింద‌నాలి. ఎందుకంటే ఇందులో చ‌ర్చించిన ప్ర‌ధాన‌మైన పాయింట్ భూమి. స్వాతంత్యం వ‌చ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. 60 శాతం మంది ప్ర‌జ‌లు స్వంత ఇల్లు లేకుండా ఉన్నారు. అటువంటి వారి గురించి, వారి స‌మ‌స్య‌లు గురించి చ‌ర్చించే సినిమా. ద‌ర్శ‌కుడు పా రంజిత్ ధారావి ప్రాంతాన్ని ఓ ఉదాహ‌ర‌ణంగా తీసుకుని భూమి అంద‌రి హ‌క్కు అనే స‌మ‌స్య‌ను ర‌జ‌నీకాంత్ ద్వారా చెప్పించాడు. త్వ‌ర‌లోనే రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేయ‌నున్న ర‌జ‌నీకాంత్‌కి ఉప‌యోగ‌ప‌డే కాన్సెప్ట్ ఇది. సినిమా బ్రిడ్జ్‌ఫై వ‌చ్చే ఫైట్‌, ఇంట‌ర్వెల్ బ్లాక్‌, కోర్ పాయింట్ అన్నీ మెప్పిస్తాయి.

మైన‌స్ పాయింట్స్‌:
సినిమా స్లో నెరేష‌న్‌లో ఉండ‌టం. ముఖ్యంగా ప్ర‌థ‌మార్థం. ఇక సినిమాలో కోర్ పాయింట్ బాగానే ఉన్నా.. ర‌జ‌నీకాంత్ వంటి మాస్ హీరోను.. హీరోయిజాన్ని ఇంకా ఎలివేట్ చేయాల‌నిపిస్తుంది. అంద‌రికీ కోర్ థీమ్ న‌చ్చ‌క‌పోవ‌చ్చు. ఇక తెలుగు పాట‌ల్లోని సాహిత్యం అస‌లు అర్థం కావ‌డం లేదు.

సమీక్ష‌:
కాలా చిత్రంలో రజనీ బాడీ లాంగ్వేజ్ చాలా కొత్తరకంగా ఉంది. స్టైలిష్ లుక్‌లో అదరగొట్టాడు. ఆయన చెప్పే డైలాగ్స్‌కు ప్రేక్షకులు చప్పట్ల మోత మోగించకుండా ఉండలేరు. రజనీ ఇమేజ్‌కు తగినట్టుగా పా రంజిత్ అద్భుతంగా పాత్రను డిజైన్ చేశాడు. మల్టీప్లెక్స్ ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా ఈ సినిమాను చక్కగా పా రంజిత్ తెరకెక్కించాడు. నేటి యువతరానికి కనెక్ట్ అయ్యేలా రజనీ పాత్రను రూపొందించారు. కాలా చిత్రంలోని ప్రతీ ఫ్రేమ్‌లో రజనీ చరిష్మా, స్క్రీన్ ప్రజెన్స్ వెండితెర మీద గ్రాండ్‌గా కనిపిస్తుంది. చిత్రంలోని కలర్ బ్యాలెన్స్, యాక్షన్ సీన్లు సూపర్బ్‌గా ఉంటాయి. టెక్నికల్‌గా కాలా చిత్రం ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని పంచుతుంది. దక్షిణాదిలో ఇప్పటివరకు ఇంతగా భావోద్వేగానికి గురిచేసే చిత్రం రాకపోవచ్చు. సాంకేతికంగా పరిశీలిస్తే కాలా వెండితెర మీద కొత్త ఆవిష్కరణ. స్టోరి, స్క్రీన్ ప్లే పైసా వసూల్ అని చెప్పవచ్చు. గగుర్పాటుకు గురిచేసే యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. అద్భుతమైన సినిమాటోగ్రఫీ ప్రేక్షకుడిని గొప్ప ఫీలింగ్‌ను కలుగజేస్తుంది. ధారవి మురికివాడ సెట్ ఆకట్టుకొంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టెర్రిఫిక్. ఎడిటింగ్ విభాగం పనితీరు చాలా బాగుంది.

Next Story