సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌గా రంజన్‌గొగోయ్‌ ప్రమాణ స్వీకారం

సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌గా రంజన్‌గొగోయ్‌ ప్రమాణ స్వీకారం
x
Highlights

దేశ సర్వోన్నత న్యాయస్థానం 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు సీజేగా జస్టిస్ రంజన్ గొగోయ్ చేత...

దేశ సర్వోన్నత న్యాయస్థానం 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు సీజేగా జస్టిస్ రంజన్ గొగోయ్ చేత భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ దీపక్ మిశ్రా నుంచి గొగోయ్ బాధ్యతలు స్వీకరించారు. సీనియర్ న్యాయవాది అయిన గొగోయ్ 13నెలల పాటు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించనున్నారు. ఈశాన్యం నుంచి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన తొలి సీజేఐగా గగోయ్ చరిత్ర సృష్టించారు. రాష్ట్ర‌ప‌తిభ‌వ‌న్‌లో నిర్వ‌హించిన‌ కార్య‌క్ర‌మంలో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ, లోక్‌స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories