భారీ ధర పలికిన 'అరవింద సమేత' శాటిలైట్ హక్కులు.. ఎన్టీఆర్ కెరీర్‌లోనే ది బెస్ట్!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో రూపొందుతోన్న చిత్రం 'అరవింద సమేత'. ...
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో రూపొందుతోన్న చిత్రం 'అరవింద సమేత'. ప్రకటన రోజు నుండే భారీ అంచనాల్ని మూటగట్టుకున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తొలిసారి త్రివిక్రమ్, తారక్ లు కలిసి సిసినిమా చేస్తుండటంతో బిజినెస్ సర్కిల్స్ లో కూడా చిత్రంపై హైప్ బాగానే ఉంది. ‘అరవింద సమేత’ శాటిలైట్ హక్కులను జీ తెలుగు ఛానెల్ ఏకంగా రూ.23.5 కోట్లకు సొంతం చేసుకుంది. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లోనే అతిపెద్ద శాటిలైట్ డీల్. ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఏ చిత్ర శాటిలైట్ హక్కులు ఇంత పెద్ద మొత్తానికి అమ్ముడుపోలేదు. అంతేకాదు ‘బాహుబలి 2’ తరవాత శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయిన రెండో చిత్రమిది.
ఇదిలా ఉంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చాలా బాగుందట. చిత్ర డిస్ట్రిబ్యూషన్ హక్కుల ద్వారానే రూ.70 నుంచి రూ.80 కోట్ల బిజినెస్ జరుగుతుందని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి త్రివిక్రమ్ గత చిత్రం ‘అజ్ఞాతవాసి’ ఫ్లాప్ కావడంతో ఆ ప్రభావం ‘అరవింద సమేత’పై పడుతుందని అంతా అనుకున్నారు. కానీ ‘అరవింద సేమత’పై అంచనాలు క్రియేట్ చేయడంపై దర్శక, నిర్మాతలు సఫలమయ్యారు. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా వచ్చిన ‘అరవింద సమేత’ ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దీనికి తోడు ఎన్టీఆర్ వరస హిట్లతో జోరు మీద ఉండటంతో ‘అరవింద సమేత’ కచ్చితంగా విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఏరియాల వారిగా థియేట్రికల్ రైట్స్ కూడ భారీ మొత్తం పలుకుతున్నాయి. హారిక, హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదలచేయనున్నారు. ఈ చిత్రంలో తారక్ స్నేహితుడిగా సునీల్ నటిస్తుండటం విశేషం.
Kodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMTకోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం
26 May 2022 5:44 AM GMTMohammad Hafeez: లాహోర్‌లో పెట్రోల్ లేదు... ఏటీఎంలలో డబ్బుల్లేవ్
26 May 2022 5:10 AM GMT
తెలంగాణలో హ్యుందయ్ కంపెనీ భారీ పెట్టుబడులు
26 May 2022 1:00 PM GMTEPFO: మీరు ఈ విషయాన్ని మరిచిపోతే పీఎఫ్ ఖాతా క్లోజ్ అవుతుంది...
26 May 2022 12:30 PM GMTబెంగళూరులో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన
26 May 2022 11:38 AM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTకేరళ పోలీసుల ప్రవర్తన గురించి షాకింగ్ పోస్ట్ పెట్టిన నటి
26 May 2022 11:00 AM GMT