సీఎం సలహాదారుగా అశ్లీల సీడీ నిందితుడు

సీఎం సలహాదారుగా అశ్లీల సీడీ నిందితుడు
x
Highlights

గత ఏడాది సెక్స్ సీడి ఉదంతంలో కలకలం రేపి సోషల్ నేట్ వర్క్‌లో హల్ చేసిన ప్రముఖ సీనియర్ పాత్రికేయులు వినోద్ వర్మ అని తెలిసిందే. కాగా తాజాగా ఛత్తీస్‌గఢ్...

గత ఏడాది సెక్స్ సీడి ఉదంతంలో కలకలం రేపి సోషల్ నేట్ వర్క్‌లో హల్ చేసిన ప్రముఖ సీనియర్ పాత్రికేయులు వినోద్ వర్మ అని తెలిసిందే. కాగా తాజాగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి పీఠం కౌవసం చేసుకున్న భూపేశ్ బఘేల్ కు రాజకీయ సలహాదారుగా సీనియర్ పాత్రికేయులు వినోద్ వర్మ నియమితులయ్యారు. అశ్లీల సీడీ కేసులో భాజపా నేత ప్రకాశ్ బజాజ్ ఫిర్యాదు చేయగా 2017 సీనియర్ జర్నలిస్ట్ వినోద్ వర్మను ఘజియాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా గత ఏడాది డిసెంబర్ నెలలలో వినోద్ వర్మ బైయిల్‌పై విడుదలయ్యారు. ఇక వినోద్ వర్మతో సహా సీఎం భూపేశ్ బఘేల్‌కు నలుగురు సలహాదారులను నియమిస్తూ చత్తీస్‌గఢ్‌ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రుచిర్‌ గార్గ్‌ను సీఎం మీడియా సలహాదారుగా, ఇక ప్రదీప్‌ శర్మ ప్రణాళిక, విధాన, వ్యవసాయ సలహాదారుగా, రాజేష్‌ తివారీ పార్లమెంటరీ సలహాదారుగా నియమితులయ్యారని ఆ ఉత్తర్వుల్లో ఛత్తీస్ గఢ్ సర్కార్ పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories