ఉమ్మడి మెదక్ జిల్లాలో గెలుపే లక్ష్యంగా హోరాహోరి పోరు.. సీటుపై ఉత్కంఠత

ఉమ్మడి మెదక్ జిల్లాలో గెలుపే లక్ష్యంగా హోరాహోరి పోరు.. సీటుపై ఉత్కంఠత
x
Highlights

ఉమ్మడి మెదక్ జిల్లాలో రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. సీఎం కేసీర్ సొంత జిల్లా వాడు కావడం తో పాటు కాంగ్రెస్ ప్రముఖులు గీతా రెడ్డి, దామోదర రాజ నర్సింహా,...

ఉమ్మడి మెదక్ జిల్లాలో రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. సీఎం కేసీర్ సొంత జిల్లా వాడు కావడం తో పాటు కాంగ్రెస్ ప్రముఖులు గీతా రెడ్డి, దామోదర రాజ నర్సింహా, జగ్గా రెడ్డి లాంటి నేతలు ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఉమ్మడి జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరా హోరీ పోరు కొనసాగుతోంది. గత ఎన్నికల్లో కేసీఆర్‌కి గజ్వేల్ లో స్వల్ప మెజారిటీ రావడంతో ఈ నియోజకవర్గంపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి నిలిపారు. తన గెలుపు బాధ్యతను మంత్రి హరీష్ రావుకు అప్పగించారు. దీంతో హరీష్ రావు నియోజక విస్తృతంగా పర్యటించారు. వివిధ సంఘాల నేతలను కలిసి ప్రతిపక్షంలోని అసంతృప్తులను నయానో, భయానో తన దారికి తెచ్చుకున్నారు. ఈసారి సీఎం 50వేల మెజారిటీతో నెగ్గుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు..

ఇక గజ్వేల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి తనదైన సైలిలో దూసుకు పోతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి 34 వేల ఓట్లు తెచ్చుకున్న నర్సా రెడ్డి అనంతరం టీఆరెస్ పార్టీ‌లో చేరాడు. తిరిగి ఇటీవలే కాంగ్రెస్ పార్టీ లో చెరారు. ప్రతాప్ రెడ్డి తో కలిసి ప్రచారం లో పాల్గొంటున్నారు. నర్సా రెడ్డి చేరిక కాంగ్రెస్‌కు లాభిస్తుందని అంచనా వేస్తున్నారు. గజ్వెల్ లో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారన్న సానుభూతి ప్రతాప్ రెడ్డి కి కలిసొస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది.

అందరూ సిద్ధిపేటలో వార్ వన్ సైడ్ ఉన్నట్లే కనిపిస్తుంది. మహాకూటమి, బీజేపీ అభ్యర్థుల నుంచి టీఆర్ఎస్ నేత హరీష్ రావుతో పోటీ పడుతున్నప్పటికీ పోటీ ఇవ్వలేరని విష్లేషకులు భావిస్తున్నారు. హరీష్ రావు ఈసారి ఎలాగైనా లక్ష మెజారిటీ సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఇక ఆందోల్ నుంచి కాంగ్రెస్ నేత దామోదర రాజ నర్సింహ, టీఆర్ఎస్ అభ్యర్థి జర్నలిస్ట్ క్రాంతి కిరణ్‌ల మధ్య తీవ్ర పోటీ ఉంది. సిటింగ్ ఎమ్మెల్యే బాబూమోహన్ పై వ్యతిరేకతఉందని నమ్మిన టీఆర్ఎస్ ఈ స్థానంలో కాంత్రి కిరణ్‌కు నిలబెట్టింది. దీంతో ఈ నియోజక వర్గంలో హోరా హోరీ తప్పని పరిస్థితి.

కాంగ్రెస్ పార్టీ‌కి చెందిన మరో మంత్రి గీతా రెడ్డి జహీరాబాద్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడి టీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్యనే ప్రధాన పోటీ ఉంది. గీత రెడ్డికి అనుకూలంగా కూటమి లోని ఇతర పార్టీల నేతలు పనిచేస్తున్నారు. ఇక టీఆర్ఎస్ అభ్యర్థి మానిక్ రావు గత ఎన్నికల్లో గీతారెడ్డి చేతిలో స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. దీంతో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ నియోజకవర్గలో ఉంటూ మైనారిటీ, కాంగ్రెస్ ఓటు బ్యాంకుపై ప్రభావం చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక జిల్లాకు చెందిన మరో ఇద్దరు కాంగ్రెస్ ముఖ్య నేతలు మాజీ మంత్రి సునీత లక్ష్మా రెడ్డి, మాజీ విప్ జగ్గా రెడ్డి నియోజకవర్గాల్లో సైతం టీఆరెస్ , కాంగ్రెస్ ల మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది. మొత్తానికి ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య పోరు కారణంగా ఉత్కంఠ రేపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories