logo
జాతీయం

వివాదంగా మారిన ముద్దుల పోటీలు

Highlights

ఆధునికతకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని చెబుతూ, జార్ఖండ్ ఎమ్మెల్యే నసైమన్ మరాండీ తన స్వగ్రామంలో నిర్వహించిన...

ఆధునికతకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని చెబుతూ, జార్ఖండ్ ఎమ్మెల్యే నసైమన్ మరాండీ తన స్వగ్రామంలో నిర్వహించిన ముద్దుల పోటీ వివాదాస్పదమవుతోంది. ఆదివాసీయుల మధ్య ప్రేమను పెంచుతున్నామని, వారిని వృద్ధి బాటలోకి నడిపిస్తామని చెబుతూ, ఆయన ఆధ్వర్యంలో గాఢ చుంభనాల పోటీ జరుగగా, ఎక్కువ సేపు ముద్దు పెట్టుకున్న జంటలకు బహుమతులు కూడా అందించారు. ఆదివాసీయులు అమాయకులు.. పైగా నిరక్షరాస్యులు. అందుకే వారి కుటుంబాలలో బంధాలు అంత బలంగా ఉండవు. భార్యభర్తల మధ్య ప్రేమను పెంచేందుకే ఈ పోటీ నిర్వహిస్తున్నా. ఆధునికత నేర్పించి వారిని అభివృద్ధి బాటలోకి తీసుకొస్తా’’ అని నసైమన్ చెబుతున్నారు. కాగా, ఇలా బహిరంగ ముద్దులు సభ్యత కాదని ఆరోపిస్తూ మహిళా సంఘాలు మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశాయి.

Next Story