మహిళ కడుపులో మంగళసూత్రం, గాజులు, ఇనుపమేకులు

మహిళ కడుపులో మంగళసూత్రం, గాజులు, ఇనుపమేకులు
x
Highlights

మతిస్థిమితం లేని ఓ మహిళ కడుపులో మంగళసూత్రం, గాజులు, ఇనుపమేకులు దర్శనమిచ్చిన ఘటన అహ్మదాబాద్ నగరంలో వెలుగుచూసింది. మహారాష్ట్రలోని షిర్డీకి చెందిన...

మతిస్థిమితం లేని ఓ మహిళ కడుపులో మంగళసూత్రం, గాజులు, ఇనుపమేకులు దర్శనమిచ్చిన ఘటన అహ్మదాబాద్ నగరంలో వెలుగుచూసింది. మహారాష్ట్రలోని షిర్డీకి చెందిన సంగీత(40) మానసిక వికలాంగురాలు. ఆమె ఏం చేస్తుందో ఆమెకే తెలియని పరిస్థితి. కనిపించిన వస్తువులన్నింటినీ తినేస్తుంది. అయితే ఆమెకు ఇటీవల కడుపులో తీవ్రమైన నొప్పి వచ్చింది. దీంతో సంగీతను అక్టోబర్ 31న అహ్మదాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సంగీతకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఆమె కడుపులో ఇనుప ముక్కలు, బోల్టులు, సేఫ్టి పిన్స్, పిన్నిసులు, హెయిర్ పిన్స్, బ్రాస్‌లెట్స్, చైన్లు, మంగళసూత్రం, కాపర్ రింగ్, గాజులు కనిపించాయి. సుమారు రెండున్నర గంటల పాటు సర్జరీ చేసి ఆమె కడుపులో ఉన్న వస్తువులన్నింటినీ బయటకు తీశారు. వీటి బరువు 1.5 కేజీలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Mangalsutra bangles iron nails removed from woman stomach in Ahmedabad

Show Full Article
Print Article
Next Story
More Stories