మరో మలుపు తిరిగిన కాస్టింగ్ కౌచ్ వివాదం

సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వివాదం మరో మలుపు తిరిగింది. పీవోడబ్ల్యూ నేత సంధ్య చేసిన తీవ్ర ఆరోపణలపై జీవితా...
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వివాదం మరో మలుపు తిరిగింది. పీవోడబ్ల్యూ నేత సంధ్య చేసిన తీవ్ర ఆరోపణలపై జీవితా రాజశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు పరువు నష్టం దావా వేయడానికి కూడా రెడీ అయ్యారు. మరోవైపు నటీనటులుగా ఎవర్ని తీసుకోవాలో నిర్మాత , దర్శకుల ఇష్టమన్న జీవిత ప్రతిభ ఉన్నవారిని పిలిచిమరీ అవకాశాలు ఇస్తారని చెప్పారు.
టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌పై ఓ చానల్‌లో మాట్లాడిన మహిళా సంఘం నేత సంధ్య జీవితా రాజశేఖర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. తన గురించి అసత్యాలు మాట్లాడారంటూ జీవితా రాజశేఖర్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ కుటుంబంపై అసత్య ప్రచారం చేసిన చానల్‌పైనా, సంధ్యపైనా పరువు నష్టం దావా కూడా వేస్తాననీ తమపై చేసిన ఆరోపణలకు సమాధానం వచ్చే నిద్రపోనని జీవిత అన్నారు. జీవిత ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తామని జూబ్లీ హిల్స్ సీఐ చంద్రశేఖర్ చెప్పారు.
శ్రీరెడ్డికి ఏమి కావాలో ఆమెకే క్లారిటీ లేదని జీవిత వ్యాఖ్యానించారు. టాలెంట్ ఉంటే అవకాశాలు అవే వస్తాయన్నారు. అన్ని రంగాల్లో మహిళలపై వివక్ష జరుగుతూనే ఉందనీ తెలుగు సినీ పరిశ్రమలో వివాదాలు తలెత్తినప్పుడు చర్యలు తీసుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయనీ అన్నారు. అయితే జీవితా రాజశేఖర్ పై చేసిన ఆరోపణలకు తన దగ్గర ఆధారాలున్నయనీ..వాటిని బయట పెట్టడం పెద్ద సమస్య కాదనీ సంధ్య అన్నారు. మరి కాస్ట్ కౌచింగ్ పై జరుగుతున్న మాటల యుద్ధం ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాలి.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
Diabetics: మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఈ జ్యూస్ దివ్యఔషధం..!
21 May 2022 12:00 PM GMTMLC Kavitha: రచ్చబండ కొచ్చే కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి చూపించండి
21 May 2022 11:30 AM GMTSweat: వేసవిలో చెమట ఎక్కువగా పడుతుందా.. ఈ చిట్కాలు పాటించండి..!
21 May 2022 11:00 AM GMTఅఖిలేశ్ యాదవ్‌తో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ
21 May 2022 10:52 AM GMTకేన్స్ లో 'రాకెట్రీ' ప్రివ్యూ..మాధవన్‌పై ఏఆర్ రెహమాన్ ప్రశంసలు
21 May 2022 10:28 AM GMT