దారి తప్పిన నాయకురాలు...ఎన్నికల ఖర్చుల కోసం..

ప్రజలకు సేవ చేస్తానని చెబుతూ రాజకీయాల్లోకి వచ్చే వారు అందరికీ ఆదర్శంగా నిలవాలి. కానీ వారే దారితప్పితే......
ప్రజలకు సేవ చేస్తానని చెబుతూ రాజకీయాల్లోకి వచ్చే వారు అందరికీ ఆదర్శంగా నిలవాలి. కానీ వారే దారితప్పితే... అటువంటి ఘటనకు నిదర్శనమే ఈ వార్త. కర్ణాటకలో ఇప్పుడు కలకలం రేపుతోంది.వాకింగ్‌కు వెళ్లిన మాజీ నగర సభ సభ్యుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి మల్లికార్జునప్పను కిడ్నాప్ చేసి రూ 60 లక్షలు నగదును తీసుకోని విడిచిపెట్టిన నలుగురు నిందితులను ఈశాన్య విభాగం పోలీసులు అరెస్టు చేశారు. జేడిఎస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్రాధ్యక్షురాలు అర్షియా ఆలీ ఈ కేసులో పట్టుబడడం విశేషం. రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బు అవసరమని ఆమె అపహరణ మాస్టర్ ప్లాన్ వేసినట్లు పోలీసులు విచారణలో తేలింది.పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ సంవత్సరం కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాలని భావించిన ఆమె, ఎన్నికల ఖర్చు కోసం ఈ మాస్టర్ ప్లాన్ వేసింది.
కాంతరాజ్ గౌడ, ప్రసాద్, డ్రైవర్ ప్రదీప్ లను టీమ్ గా చేర్చుకున్న ఆమె, మారణాయుధాలతో వచ్చి మల్లికార్జునప్పను బెదిరించి బలవంతంగా తీసుకెళ్లారు. ఆపై అతని కుమారుడు, డాక్టరుగా పని చేస్తున్న రవికుమార్ కు ఫోన్ చేసి రూ. 100 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో హైదరాబాద్ లో ఉన్న ఆయన, డబ్బు ఇస్తానని హామీ ఇచ్చి, తండ్రికి హాని తలపెట్టవద్దని వేడుకున్నాడు. ఆపై రూ. 60 లక్షలు సమకూర్చుకుని, స్నేహితుల సలహా మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో యహలంక డీసీపీ గిరీశ్ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. ఆయన కిడ్నాపైన ప్రదేశంలోని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించింది. మొబైల్ నంబర్ ఆధారంగా హొరమావి ప్రాంతంలో ఉన్న కారు డ్రైవర్ ప్రదీప్ తొలుత పట్టుబడగా, అతనిచ్చిన సమాచారంతో మిగతా వారినీ అరెస్ట్ చేశారు. వారి నుంచి కోటి రూపాయలకు పైగా నగదు, బంగారు నగలు, ఫిస్టల్, తూటాలు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని తెలిపారు.
Bandi Sanjay: డీజీపీకి డెడ్‌లైన్ విధించిన బండి సంజయ్
15 Aug 2022 9:19 AM GMTతెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన కే.కేశవరావు
15 Aug 2022 8:15 AM GMTగోల్కొండ కోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
15 Aug 2022 6:33 AM GMTచిరంజీవి బ్లడ్ బ్యాంకులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 6:17 AM GMTమంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 4:49 AM GMT75th Independence Day: తెలంగాణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 2:52 AM GMTFreedom Rally: పోలీసుల తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
13 Aug 2022 10:37 AM GMT
వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్న సీఎల్పీ బృందం
16 Aug 2022 4:06 AM GMTనంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం
16 Aug 2022 3:51 AM GMTరిషి సునాక్ కు వ్యతిరేక పవనాలు
16 Aug 2022 3:34 AM GMTఇవాళ రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం
16 Aug 2022 3:09 AM GMTనేడు అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటన .. ఏటీసీ టైర్స్ ప్రారంభం
16 Aug 2022 2:28 AM GMT