జేడీఎస్‌-కాంగ్రెస్‌ దోస్తీ కోసం రాహుల్‌ కుస్తీ

జేడీఎస్‌-కాంగ్రెస్‌ దోస్తీ కోసం రాహుల్‌ కుస్తీ
x
Highlights

కన్నడనాట జేడీఎస్‌, కాంగ్రెస్ మైత్రి దీర్ఘకాలం కొనసాగేందుకు హస్తం అధినేత రాహుల్ గాంధీ తీవ్ర స్ధాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ వైపు పార్టీలో ఉన్న...

కన్నడనాట జేడీఎస్‌, కాంగ్రెస్ మైత్రి దీర్ఘకాలం కొనసాగేందుకు హస్తం అధినేత రాహుల్ గాంధీ తీవ్ర స్ధాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ వైపు పార్టీలో ఉన్న అసంతృప్తులను చల్లారుస్తూనే ... జేడీఎస్‌తో మిత్రత్వం చెడకుండా సమన్వయంతో రాజకీయ చాణక్యం ప్రదర్శిస్తున్నారు. తాజాగా మంత్రి వర్గంలో చోటు కోసం ఎదురుచూస్తున్న నేతలతో రాహుల్ స్వయంగా మాట్లాడి సమస్యను పరిష‌్కరించారు.

కర్నాటకలో ఐదేళ్ల పాటు స్ధిరంగా అధికారంలో ఉండాలని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు తమవైపు నుంచి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే చర్యలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. మంత్రి వర్గ కూర్పుపై కాంగ్రెస్ నేతల మధ్య అసంతృప్తి రగులుతోందన్న వార్తలు వినిపించిన వెంటనే అధినేత రాహుల్ నేరుగా రంగంలోకి దిగారు. సీనియర్ నేతలతో స్వయంగా చర్చించి మంత్రి పదవులు ఆశిస్తున్న ఆశావాహుల జాబితాను పరిశీలించారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో చర్చించి ప్రాంతాల వారిగా సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకుని 21 మంది మంత్రులను ఎంపిక చేశారు. సీఎం కుమారస్వామికి ఈ విషయాన్ని తెలియజేసిన రాహుల్ దూతలు .. తమ పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహించబోయే మంత్రుల జాబితాను అందించారు. ఇందుకు కుమారస్వామి సానుకూలంగా స్పందించారు.

వాయిస్: లింగాయత్‌ల నుంచి సమస్య తలెత్తకుండా ఎంబీ పాటిల్‌, శివశంకరప్పను మంత్రివర్గంలో తీసుకోనున్నారు. డీకే శివకుమార్‌, జార్జి, రామలింగారెడ్డి, ఆర్‌వీ దేశపాండే, రోషన్‌ బేగ్‌, సతీష్‌ జర్కోలి కూడా మంత్రివర్గంలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories