జవాన్ మూవీ రివ్యూ

Highlights

డైరక్టర్ కమ్ స్టోరీ రైటర్ బీవీఎస్ రవి,హీరో సాయిథరమ్ తేజ్ లు నమ్ముకున్న జవాన్ వారిద్దరని గట్టెక్కిస్తుందా...? వాంటెడ్ సినిమాతో ఢీలా పడ్డ బీవీఎస్ రవి,...

డైరక్టర్ కమ్ స్టోరీ రైటర్ బీవీఎస్ రవి,హీరో సాయిథరమ్ తేజ్ లు నమ్ముకున్న జవాన్ వారిద్దరని గట్టెక్కిస్తుందా...? వాంటెడ్ సినిమాతో ఢీలా పడ్డ బీవీఎస్ రవి, తిక్క’, ‘విన్నర్ తో రెండ్లు ప్లాపుల్ని మూటగట్టుకున్న సాయి జవాన్ తో హిట్ కొట్టాడా..? అనే విషయాల్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

రెండు ప్లాపులు మూటగట్టుకున్న సాయిథరమ్ తేజ్ జవాన్ పై కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. అందుకే సినిమా షూటింగ్ నుంచి ప్రమోషన్ వరకు సినిమా చర్చకు దారితీసేలా ప్రయత్నాలు చేశాడు. ముఖ్యంగా జవాన్ పోస్టర్లలలో సినిమాకి సంబంధంలేకుండా మెగస్టార్ చిరంజీవిని, మహాత్మాగాంధీని పెట్టీ మరి సినిమాలపై అంచనాల్ని పెంచేశాడు. ఆ అంచనాల్ని జవాన్ అందుకుందా లేదా అనేది తెలియాంటే.. హీరోగా తన కెరీర్‌కు కీలకమైన ఈ సినిమాతో మెగా మేనల్లుడు విజయాన్ని అందుకున్నాడో.. లేదో.. సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ :

జై (సాయిథరం తేజ్ ), కేశవ్ (ప్రసన్న)లు ఇద్దరు చిన్ననాటి ప్రాణ స్నేహితులు. అయితే వీరి ఆలోచన ధోరణి మాత్రం అందుకు విభిన్నంగా ఉంటుంది. జై కి దేశ భక్తి చాలా ఎక్కువ, కేశవ్ కి స్వార్ధం ఎక్కువ. దేశం కోసం ఏదో ఒకటి చేయాలనే తపనతో ఉన్న జై డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీవో)లో ఉద్యోగం సంపాదిస్తాడు. క్రిమనల్ మైండ్ గేమ్ ఆడే కేశవ్ ఉగ్ర దాడులకు పాల్పడుతుంటాడు. అయితే ఉగ్రవాదిగా మారిన కేశవ్ నుంచి దేశాన్ని జై ఎలా కాపాడాడు అనే ఇతివృత్తాంతంగా బీవీఎస్ రవి కథను పక్కాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

డీఆర్ డీవో లో ఉద్యోగం చేస్తున్న జై ఆక్టోపస్ అనే మిస్సైల్ తయారు చేస్తాడు. ఆ విషయం తెలుసుకున్న కేశవ్ ఆ మిస్సైల్ ను చేజిక్కించుకొని ఉగ్రవాదులకు అమ్మేయాలనుకుంటాడు. మరి ఆ మిస్సైల్ తన చేతికి రావాలంటే అది జై వల్లే సాధ్యం అవుతుంది. కాబట్టి జైని బెదిరించి అతని కుటంబసభ్యుల్ని కిడ్నాప్ చేస్తాడు కేశవ్ . మరి ఈ పరిస్థితుల నుంచి జై ఎలా బయటపడ్డాడు..? కుటుంబాన్ని, దేశ సంపదను ఎలా కాపాడాడు..? ఒక కామన్ మ్యాన్ ఉగ్రవాదులను ఎలా ఎదిరించాడు..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

విశ్లేషణ:

ఈ మధ్య రొటీన్ గా వస్తున్న దేశం , కుటుంబం కోసం తపనపడే మధ్యతరగతి యువకుడి కథ ఈ జవాన్. అయితే ఇది రొటీన్ స్టోరీ అయిన బీవీఎస్ రవి తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా జవాన్ ఉగ్రవాదుల్ని ఆటకట్టించడం చాలా బాగుంది. దేశభక్తి గురించి వివరించే సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్ తో ఉన్న డైలాగులు బాగా రక్తికట్టించడంతో ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుందనే సందేహం లేదు. ఇక సాయిధరం తేజ్ నట ఆకట్టుకుంటుంది. డాన్స్, యాక్షన్ సీన్స్ రెచ్చిపోయాడు. గత చిత్రాలకంటే సీనియర్ హీరోలా యాక్ట్ చేసి అందర్ని ఆశ్చర్యపరిచాడు. హీరోయిన్ మెహరీన్ గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. విలన్ గా యాక్ట్ చేసిన హీరోయిన్ స్నేహ భర్త ప్రసన్నకి ఇది తొలి తెలుగు సినిమా అయినా ప్రేక్షకుల్ని మెప్పించి తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కించిన ఈ సిినిమాలో పాటలు, సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. అయితే కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడంతో రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో ‘జవాన్’ కూడా ఒకటిగా మిగిలిపోతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories