Top
logo

బుమ్రా సిక్స్‌ ప్యాక్‌కు అమ్మాయిలు ఫిదా

Highlights

టీమిండియా క్రికెటర్లు గత కొంత కాలంగా ఫిట్‌నెస్ కోసం తెగ కష్టపడుతున్నారు. ఫిట్‌నెస్‌కు కేరాఫ్‌లా నిలిచే విరాట్...

టీమిండియా క్రికెటర్లు గత కొంత కాలంగా ఫిట్‌నెస్ కోసం తెగ కష్టపడుతున్నారు. ఫిట్‌నెస్‌కు కేరాఫ్‌లా నిలిచే విరాట్ కోహ్లి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాక మిగతా ఆటగాళ్లు కూడా ఫిట్‌గా ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆటగాళ్లంతా కెప్టెన్ బాటలో నడుస్తున్నారు. భారత డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ బుమ్రా శుక్రవారం ఓ ఫొటో దిగి సోషల్ మీడియాలో ఉంచగా.. కాసేపట్లోనే అది వైరల్‌గా మారింది.‘మనకు మనమే మెరుగవ్వాలంటే అంకిత భావంతో నిరంతరం కష్టపడటం అవసరం’అనే క్యాఫ్షన్‌తో షేర్‌ చేసిన ఈ ఫోటోకు భారత అభిమానుల నుంచి కామెంట్లు, లైక్స్‌ వెల్లువెత్తాయి.‘వావ్‌ బుమ్రా లవ్‌ యూ అంటూ అమ్మాయిల తెగ ముచ్చట పడుతున్నారు.

Next Story