Top
logo

మా నాన్న సీఎం అయితే..

మా నాన్న సీఎం అయితే..
X
Highlights

కాంగ్రెస్ పార్టీలో తాను 2004 నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నానని సీనియర్ నేత మాజీ హోంమంత్రి జానా రెడ్డి...

కాంగ్రెస్ పార్టీలో తాను 2004 నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నానని సీనియర్ నేత మాజీ హోంమంత్రి జానా రెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్ రెడ్డి తెలిపారు. ఓ కుటుంబానికి ఒకే టికెట్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గతంలో ఎన్నడూ చెప్పలేదని వెల్లడించారు. ఈసారి కాంగ్రెస్ అధిష్ఠానం తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎల్‌పీ నేత జానారెడ్డి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, తన తండ్రి సీఎం కావడం కన్నా ఇంకేం కావాలని వ్యాఖ్యానించారు.

Next Story