తండ్రి తరపున తనయ ప్రచార భేరి

x
Highlights

తూర్పు జ‌యా రెడ్డి...డాట‌ర్ ఆఫ్ జ‌గ్గారెడ్డి. సంగారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయిన‌ర్. మొద‌టిసారిగా ప్రజ‌ల ముందుకు...

తూర్పు జ‌యా రెడ్డి...డాట‌ర్ ఆఫ్ జ‌గ్గారెడ్డి. సంగారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయిన‌ర్. మొద‌టిసారిగా ప్రజ‌ల ముందుకు వ‌చ్చి, అసెంబ్లీ సెగ్మెంట్‌ను చుట్టేస్తున్నారు జయారెడ్డి. తండ్రి యాస‌, భాష‌తో కార్యకర్తల్లో హుషారు నింపారు. సంగారెడ్డిలో తండ్రికి తగ్గయ అనిపించుకుంటున్న జయారెడ్డిపై స్పెషల్ స్టోరి.

సంగారెడ్డి నియోజ‌క‌వర్గం కేంద్రంగా, కొంతకాలంగా రాజకీయ వేడి రగులుకుంది. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అరెస్టు, బంద్‌, నిరసనలతో ఆ నియోజకవర్గం హోరెత్తింది. ఆ తర్వాత జగ్గారెడ్డి, స్వల్ప అస్వస్థతతో విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో జగ్గారెడ్డికి బదులుగా ఆయన కుటుంబం, ప్రచార బరిలోకి దిగింది. ఆయన భార్య నిర్మలా జ‌గ్గారెడ్డి, కూతురు జ‌యా రెడ్డిలు, నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముఖ్యంగా కూతురు జయారెడ్డి క్యాంపెన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. జ‌గ్గారెడ్డికి బ‌దులుగా ఆయన భార్య నిర్మలా జ‌గ్గారెడ్డి, కూతురు జ‌యా రెడ్డిలు జెండా పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొట్టమొద‌టి సారిగా పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న జ‌యారెడ్డికి కార్యక‌ర్తల నుంచి అపూర్వ స్పంద‌న ల‌భించింది. జ‌గ్గారెడ్డి లాగే కార్యక‌ర్తల్లో హుషారు నింపే ప్రయ‌త్నం చేయ‌డంతో, కాంగ్రెస్ కార్యక‌ర్తలు, నాయ‌కులు తండ్రికి త‌గ్గ త‌న‌య అంటూ మురిసిపోతున్నారు.

ఇటీవ‌లే బిజినెస్ మెనేజ్‌మెంట్‌లో బ్యాచిల‌ర్ డిగ్రీ పూర్తి చేసుకున్నారు జ‌యారెడ్డి. తండ్రి జ‌గ్గారెడ్డి స్వల్ప అస్వస్థతకు గుర‌వ‌డంతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్యులు సూచించ‌డంతో, ఆయన హైద‌రాబాద్‌లోనే ఉంటున్నారు. నియోజ‌వ‌ర్గంలో పార్టీ జెండా కార్యక్రమం నిర్వహించాల్సి రావ‌డంతో త‌న‌కు బ‌దులుగా త‌న భార్య ఉమ్మడి జిల్లా మ‌హిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మలా జ‌గ్గారెడ్డిని పంపించాల‌ని నిర్ణయించారు. అమ్మకు తోడు తానూ పార్టీ కార్యక్రమంలో పాల్గొంటాన‌ని జ‌యారెడ్డి ముందుకు వ‌చ్చారు. ఇప్పటి వ‌ర‌కు పార్టీలోని కొద్దిమంది ముఖ్య నాయకుల‌కు, అనుచ‌రుల‌కు మాత్రమే జయారెడ్డి తెలుసు. మొట్టమొద‌టి సారిగా ప్రజ‌ల ముందుకు రావ‌డంతో, కాంగ్రెస్ పార్టీ కార్యక‌ర్తల‌తో పాటు ప్రజ‌లు ఆమెను చూసేందుకు ఆసక్తి క‌న‌బ‌రిచారు. ఆమె ఏమి మాట్లాడతారో, ఎట్లా మాట్లాడతారోనని ఎదురు చూశారు. అచ్చం తండ్రిలా, ఉల్లాసంగా మాట్లాడుతోందని కేరింత‌లు కొట్టారు.

అంద‌ర్నీ ప‌ల‌క‌రిస్తూ వృద్దుల‌తో ఆప్యాయంగా చేయి క‌లుపుతూ, క‌లివిడిగా తిరిగారు జయారెడ్డి. వంద‌లాది ప్రజ‌ల ముందు మాట్లాడుతున్నా, ఏమాత్రం బెరుకు, భ‌యం లేకుండా ప్రసంగించడం, అంద‌ర్నీ ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తుండ‌టంతో తండ్రికి త‌గ్గ బిడ్డ అని నాయ‌కులు అనుకుంటున్నారు. భ‌విష్యత్తులో మంచి నాయ‌కురాలిగా ఎదుగుతావ‌ని ఆమెను దీవిస్తున్నారు. రూపంలోనూ, మాట‌లోనూ జ‌గ్గారెడ్డిని పోలిన జ‌యారెడ్డి, పుట్టిన రోజు సైతం, తండ్రి జన్మించిన జూలై ఏడే. రాష్ట్ర వ్యాప్తంగా త‌న‌కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జ‌గ్గారెడ్డికి, తండ్రికి త‌గ్గ త‌న‌యురాలు అనిపించుకుంటున్నారని జ‌యారెడ్డిపై ప్రశంసలు కురిపిస్తున్నారు సంగారెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు.

Show Full Article
Print Article
Next Story
More Stories