logo
సినిమా

జబర్దస్త్ ఫ్యామిలీలో పవన్ చిచ్చు..

జబర్దస్త్ ఫ్యామిలీలో పవన్ చిచ్చు..
X
Highlights

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడు అందరినోళ్లలోనూ నానుతున్నాడా? పవన్ కల్యాణ్ ఏ ఉద్దేశంతో జగన్ పై పరోక్షంగా...

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడు అందరినోళ్లలోనూ నానుతున్నాడా? పవన్ కల్యాణ్ ఏ ఉద్దేశంతో జగన్ పై పరోక్షంగా వ్యాఖ్యలు చేశాడో కానీ పరోక్షంగా చాలా చిచ్చులకు కారణమయ్యాడు.. ముఖ్యంగా జబర్దస్త్ కుటుంబంలో ఆరని చిచ్చును రాజేశాడు.. ముఖ్యంగా జబర్దస్త్ జడ్జిలిద్దరూ ముఖా ముఖాలు చూసుకోడానికి ఇబ్బంది పడేలా ఈ మధ్య పరిణామాలు మారిపోయాయి. ఓ టివి చర్చలో బండ్ల గణేష్, వర్సెస్ రోజా మధ్య మాటల యుద్ధం కాస్త పరిధులు, పరిమితులు దాటి.. అభ్యంతరకరంగా మారింది. బండ్లగణేష్ రోజాను ఐరెన్ లెగ్ అంటూ చేసిన కామెంట్లకు మండిపడిన రోజా.. వాడకూడని భాష వాడుతూ బండ్ల గణేష్ ను తూర్పారబట్టింది.

దాంతో రాజుకున్న చిచ్చు సోషల్ మీడియాలో వైరల్ గా మారి మంటలు పుట్టిస్తోంది. జబర్దస్త్ షోలో నాగబాబు, రోజాలతో సహా నటులందరూ చాలా చాలా సరదాగాఉంటారు.. ఒక ఫ్యామిలీలా ఫీలవుతారు. నాగబాబు, రోజా కూడా చక్కగా మాట్లాడుకుంటారు... మరి ఈ మాటల మంటల నేపధ్యంలో వారిద్దరూ ఎలా ఉంటారన్న ఆసక్తి అందరిలోనూ కలుగుతోంది. అయితే రోజా ఈ విషయంపై ఇప్పటికే చాలాసార్లు క్లారిటీ ఇచ్చింది. పైకి ఎన్ని తిట్టుకున్నా.. అవన్నీ రాజకీయాలలో భాగమేనని చిరంజీవి కుటుంబంతో తనకెప్పుడూ సన్నిహిత సంబంధాలే ఉన్నాయనీ, ఉంటాయనీ చెప్పేసింది. ఖైదీ నెంబర్ 150 సినిమా రిలీజ్ సందర్భంగా వైసీపీ అనుకూల ఛానెల్ కి యాంకర్ గా మారి చిరును స్వయంగా ఇంటర్వ్యూ చేసి మరీ తన అభిమానాన్ని చాటుకుంది. కాబట్టి పవన్ కల్యాణ్ విషయంలో నాగబాబు, రోజా మధ్య పెద్దగా మాటల యుద్ధం రాదు కానీ.. హైపర్ ఆది విషయమే కాస్త సస్పెన్స్ గా మారింది.

ఇప్పటికే పవన్ కల్యాణ్ ను కత్తి మహేష్ విమర్శించడాన్ని తీవ్రంగా తీసుకున్న హైపర్ ఆది తన స్కిట్టుల ద్వారా మహేష్ పై అదిరిపోయే పంచ్ లేశాడు.. మరిప్పుడు పవన్ ను రోజా విమర్శించిన నేపధ్యంలో ఆది ఎలా రియాక్టవుతాడు?పవన్ ను ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేది లేదని తరచుగా చెప్పే ఆది రోజా కామెంట్లపై ఎలా రియాక్టవుతాడు?ఇక్కడ కూడా రాజకీయాలు వేరు.. పర్సనల్ అభిమానం వేరు అని అనుకోవాలా? సాధారణంగా జబర్దస్త్ షోలో పాల్గొనే నటులందరూ రోజాపై ప్రత్యేకాభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు.. ఒక్కోసారి ఆమెపైనే సున్నితమైన పంచ్ లేస్తూ ఏడిపిస్తుంటారు.. రోజా కూడా వాటిని లైట్ గానే తీసుకుంటుంది.. వారిని చాలా అభిమానంతో అప్పుడప్పుడు ముద్దు ముద్దుగా చురకలేస్తుంది.దసరా సందర్భంగా జబర్దస్త్ ప్రత్యేక షో ఎండింగ్ లో అయితే రోజా కన్నీరు పెట్టుకుంది.. జబర్దస్త్ ను తనను విడదీసి చూడలేమని.. అందులో నటులందరూ తనకు ఎంతో క్లోజ్ అయ్యారని..అభిమానం చూపిస్తారనీ చెబుతూ ఒక్కసారిగా ఏడ్చేసింది. పవన్ పై విమర్శల నేపధ్యంలో రోజాపై కూడా ఆది సెటైర్లు వేస్తాడా? లేక రాజకీయాలు వేరు.. జబర్దస్త్ వేరు అని ఊరుకుంటాడా? లేదా రోజాపై అభిమానంతో బండ్ల గణేష్ ను పంచులతో ఉతికి ఆరేస్తాడా అన్నది సస్పెన్స్ గా మారింది.మొత్తం మీద ఒక్క పవన్ కల్యాణ్ ఇంతమంది మధ్య చిచ్చు పెట్టాడు..

Next Story