వైట్ హౌస్ లో చక్రం తిప్పుతున్న బ్యూటీ

వైట్ హౌస్ లో చక్రం తిప్పుతున్న బ్యూటీ
x
Highlights

ఇవాంకా ఈ పేరు ఇప్పుడు భాగ్యనగరంలో సంచలనం సృష్టిస్తోంది అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె అయిన ఇవాంకా హైదరాబాద్ లో గ్లోబల్ బిజినెస్ మీట్ కి...

ఇవాంకా ఈ పేరు ఇప్పుడు భాగ్యనగరంలో సంచలనం సృష్టిస్తోంది అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె అయిన ఇవాంకా హైదరాబాద్ లో గ్లోబల్ బిజినెస్ మీట్ కి రావడం నగర రూపు రేఖలనే మార్చేస్తోంది. ఇవాంకా కోసం అసాధారణ భద్రత, అత్యాధునిక వసతి,రవాణా సదుపాయాలతో భాగ్యనగరం ముస్తాబవుతోంది. ఇంతకీ ఈ సదస్సుకు ఇవాంకాయే గెస్ట్ ఎందుకైంది?

ఆమె ఓ అసాధారణ లేడీ శ్వేత సౌధాధిపతి కుమార్తె ఆమెకంటూ ప్రత్యేకమైన అధికారిక హోదా ఏదీ లేదు కేవలం డోనాల్డ్ ట్రంప్ సలహాదారు అంతే కానీ ఇవాంకాది వంక పెట్టలేని వ్యక్తిత్వమేనంటున్నారు ఆమెను దగ్గర నుంచి చూసిన వారు అసలింతకీ ఇవాంకా తీరేంటి?

అమెరికా ఫస్ట్ లేడి కాదు ఫస్ట్ సిటిజన్ కుమార్తె ఆమె పేరు డోనాల్డ్ ఇవాంకా ట్రంప్ ఈనెల 28న హైదరాబాద్ లో జరిగే ఓ అంతర్జాతీయ వ్యాపార సదస్సుకు అతిధిగా వస్తున్నారు ఇవాంకా కోసం నగరమంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆమె పర్యటన కోసం పెద్ద పెట్టున ఏర్పాట్లు జరిగిపోతున్నాయ్.

ప్రధాని మోడీ ఆ మధ్య అమెరికాకు వెళ్లినప్పుడు ఇవాంకాను గ్లోబల్ మీట్ సదస్సుకు ఆహ్వానించారు దానికి ఆమె అంగీకరించారు ఇంతకీ హైదరాబాద్ లో జరిగే సదస్సు మహిళా సాధికారత లక్ష్యంగా సాగే సదస్సు ఇవాంకా కూడా మంచి మహిళా వ్యాపార వేత్త కావడంతో మోడీ ఈ సదస్సుకు ఆమెను ఆహ్వానించారు. ఆమె భద్రత కోసం ఏకంగా రెండు వేలమంది పోలీసులు రంగంలోకి దిగుతున్నారు. శ్వేత సౌధం అధిపతి కుమార్తె కావడంతో ఇవాంకా టూర్ కి ప్రాధాన్యత పెరిగింది.

ఇవాంకా ట్రంప్ అమెరికా ఫస్ట్ లేడీ కాదు కానీ అమెరికా పాలనా వ్యవహారాల్లో మాత్రం ఆమె రోల్ చాలా చాలా కీలకం తండ్రికి వ్యక్తిగత సలహాదారు హోదాలో ఆమె చక్రం తిప్పుతున్నారు ఇవాంకా ఆమె భర్త కుష్నర్ కూడా ఇదే హోదాలో వైట్ హౌస్ లో కొనసాగుతున్నారు వీరికోసం వెస్ట్ వింగ్ లో సెపరేట్ ఆఫీసే ఉంది వీరిద్దరూ జీతం లెక్కన కాక తండ్రి కోసం ఉచితంగా పనిచేస్తున్నారు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు, ఆయన ప్రసంగాలు, స్టేట్ మెంట్లను ఎప్పటి కప్పుడు ఈ ఆఫీస్ పర్యవేక్షిస్తుంటుంది అవసరమైన గణాంకాలు, ఇతర ఆధారాలను సమకూరుస్తుంటుంది ట్రంప్ ప్రసంగాలను ఈ టీమే రూపొందిస్తుంది ట్రంప్ ఇవాంకాను తన వ్యక్తిగత సలహదారు హోదాలో నియమించుకోడం పట్ల విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకతే వచ్చింది. అయినా ట్రంప్ డోంట్ కేర్ అని ముందుకు సాగారు ఇవాంకా కూడా ప్రత్యర్ధుల విమర్శలను పట్టించుకోరు తాను ఉచితంగా సేవ చేస్తున్నానని ఇందులో తప్పేం లేదని చెబుతున్నారు కానీ ఆమె భద్రత కోసం నివాసంకోసం రవాణా కోసం చేసే ఖర్చంతా అమెరికాలో పన్నుకట్టే సామాన్యుల ఆస్తేనని విపక్షాలు రుస రుసలాడుతుంటాయి.

అమెరికా అధ్యక్షుడి ఫస్ట్ లేడీ హోదా సంప్రదాయాన్ని పక్కనపెట్టింది ఒక్క ట్రంపే కాదు గతంలోనూ ఇలాంటి సంఘటనలున్నాయి. అమెరికా మూడవ అధ్యక్షుడు అయిన థామస్ జెఫర్సన్ భార్య చనిపోవడంతో తన కుమార్తెనే ఫస్ట్ లేడీ పదవిలో కూర్చోబెట్టారు అలాగే అమెరికా పదవ అధ్యక్షుడు అయిన జాన్ టైలర్ భార్యకు గుండెపోటు రావడంతో కోడలిని ఫస్ట్ లేడీ స్థానం లో కూర్చో బెట్టారు ఇప్పుడు మెలీనియా ట్రంప్ స్థానంలో ఇవాంకా చురుగ్గా వ్యవహరిస్తోంది. భవిష్యత్తులో అధ్యక్ష పదవికి పోటీ పడినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories