Top
logo

ఇవాంకా ట్రంప్ 100 కోట్ల ఖర్చుపై సానుకూలంగా స్పందిస్తున్న హైదరాబాదీయులు..

Highlights

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ త్వరలో హైదరాబాద్ కు విచ్చేయుచున్నారు.. ఈ...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ త్వరలో హైదరాబాద్ కు విచ్చేయుచున్నారు.. ఈ సందర్బంగా ఇవాంక వ‌స్తోంద‌ని తెలియ‌డంతో సిటీ మొత్తం అల‌ర్ట్ అయ్యింది. పోలీసుల నుంచి జీహెచ్ఎంసి, పర్యాటక, హెచ్ఎండిఎ, ఐటీ, పరిశ్రమల అధికారుల వరకు అంద‌రు అటెన్ష‌న్ అయ్యారు. ఈనెల 28న హైదరాబాద్‌లో నిర్వ‌హించే గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు ఇవాంక హాజ‌రు కానుండటమే ఈ టెన్షన్‌కు కారణం. ఇవాంక వస్తోందని తెలిసి రూ.100 కోట్ల‌ు పెట్టి మరీ హైదరాబాద్‌ను జీహెచ్ఎంసీ ముస్తాబు చేస్తోంది. వీవీఐపీలు తిరిగే జోన్లో కొత్త‌ రోడ్ల నిర్మాణం, మ‌ర‌మ్మ‌తులు, ఫుట్‌పాత్‌లు, గార్డనింగ్ పనులు ఇలా అనేక అభివృద్ధి ప‌నులు చేపట్టింది. ముఖ్యంగా పాతబస్తీతో పాటు సదస్సు జరిగే హైటెక్‌సిటీలో ఇరవై నాలుగు గంటల పాటు పనులు జరుగుతున్నాయి.

కాగా ఇవాంకా హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చుగా అంచనా వేయడంతో ప్రజల్లో కొంత సానుకూల స్పందనే కనిపిస్తుంది.. ఈ రకంగానైనా హైదరాబాద్ లో కొంత అభివృద్ధి జరుగుతుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. అంతేకాదు పాదబస్తీ ప్రజలు అయితే ఆమె వల్ల ఎన్నో ఏళ్ల తరబడి పెండింగులో ఉన్న పనులను ఆమె రాకతో పూర్తవుతుండటంతో అక్కడి స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..

Next Story