logo

'ఇవాంక ట్రంప్ అంటే పేరు కాదు..ఇట్స్ ఎ బ్రాండ్'

ఇవాంక ట్రంప్ అంటే పేరు కాదు..ఇట్స్ ఎ బ్రాండ్

ప్రపంచంలో ఎక్కడికెళ్లినా ఏ డయాస్ మీద మాట్లాడినా అమెరికా యే ఆమెకు మొదటి ప్రాధాన్యత మోస్ట్ ఫ్యాషనబుల్ లేడీ గా పేరు తెచ్చుకున్న ఇవాంకా ఆసక్తులేంటి? నేపధ్యమేంటి?వైట్ హౌస్ లో చక్రం తిప్పుతున్న ఈ లేడీ భవిష్యత్తులో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడతారా?

ఇవాంకా ఎక్కడికెళ్లినా అగ్రరాజ్య సంక్షేమమే తొలి ప్రాధాన్యం ఇతర దేశాలు, సంస్థలతో కుదుర్చుకునే ఒప్పందాలను అమెరికా సంక్షేమం కోణంలో చూశాకే అనుమతిస్తారు అమెరికాకు చేటు చేసే పర్యావరణ అగ్రిమెంట్లను ఆమె కేన్సిల్ చేయించారు కార్పొరేట్ రంగంలో నిలదొక్కుకోవాలనే కెరీర్ మైండెడ్ మహిళల కోసం తన వెబ్ సైట్ ను డెడికేట్ చేసింది ఇవాంకా. అందులో పసందైన వంటకాల తయారీ గురించే కాదు ఒక వ్యాపార వేత్తగా, వర్కింగ్ లేడీగా మహిళలు ఎలా నిలదొక్కుకోవాలన్న అంశంపై ఎన్నో సలహాలు, సూచనలూ ఉంటాయి అలాగే ఎన్నో ఛానెల్స్ కి మార్నింగ్ షో గెస్ట్ కూడా ఇవాంకానే అమెరికాలో ట్రెండింగ్ లో ఉన్న అన్ని సోషల్ మీడియా ఛానెల్స్ లోనూ ఇవాంకా సందేశాలు కనిపిస్తూనే ఉంటాయి. ఇవాంకా పాస్తా వంటకాన్ని చాలా బాగా ఇష్టపడుతుంది. క్రమశిక్షణకు అలవాటు పడిన వ్యక్తి ఆరు నూరైనా టైమ్ కి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్ కు ఠంచన్ గా టైముకు హాజరయ్యే తొలి వ్యక్తి ఇవాంకానే తన సహచరులు వచ్చి తాళాలు తీసేంత వరకూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటారు.

మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఇవాంకా దానికి సంబంధించిన సింపోజియమ్స్ కి ఎక్కువగా అటెండ్ అవుతూ ఉంటారు ఇవాంకా బ్రాండింగ్ ను నమ్మే వ్యక్తి వ్యాపారమైనా వ్యక్తిత్వమైనా ఒక బ్రాండింగ్ ఉండాలంటారామె. తన తండ్రి స్త్రీలోలుడనీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారనీ వచ్చే కామెంట్లను ఆమె పట్టించుకోరు మహిళల సంక్షేమానికి డోనాల్డ్ ట్రంప్ కృషి చేసినంతగా ఎవరూ చేయలేదంటారామె అదే ఆయన బ్రాండింగ్ అంటారు. ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి కాబట్టే ఇవాంకా భారత్ లో జరిగే భాగస్వామ్య దేశాల బిజినెస్ సదస్సుకు అతిధిగా హాజరవుతోంది.

admin

admin

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top