సస్పెన్స్‌కు తెరదించిన లవర్స్‌

సస్పెన్స్‌కు తెరదించిన లవర్స్‌
x
Highlights

బాలీవుడ్‌ లో మరో పెళ్లి బాజా మోగబోతోంది. ఇన్నాళ్లూ పీకల్లోతు ప్రేమలో ఉన్న హాట్‌ కపుల్‌ దీపికా పదుకొనె, రణ్‌వీర్‌ సింగ్‌ త్వరలోనే పెళ్లి పీటలు...

బాలీవుడ్‌ లో మరో పెళ్లి బాజా మోగబోతోంది. ఇన్నాళ్లూ పీకల్లోతు ప్రేమలో ఉన్న హాట్‌ కపుల్‌ దీపికా పదుకొనె, రణ్‌వీర్‌ సింగ్‌ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తమ వివాహానికి సంబంధించి డేట్‌ ఫిక్స్‌ చేసుకున్నారు. అలాగే వెడ్డింగ్‌ కార్డును కూడా సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

సస్పెన్స్‌కు తెరదించారు..సహజీవనానికి ఫుల్‌స్టాప్‌ పెట్టారు..పెళ్లి డేట్‌ ఫిక్స్‌ చేశారు.. ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌ అందించారు. బాలీవుడ్‌ లవర్స్‌ దీపికా పదుకొనె రణ్‌వీర్‌ సింగ్‌ పెళ్లి ముహూర్తం ఖరారు చేశారు. ఇరు కుటుంబాల ఆశీర్వాదంతో నవంబరు 14, 15 తేదీల్లో వివాహ వేడుక జరగనుందంటూ దీపికా పదుకొనె తన ట్విట్టర్‌ ద్వారా పెళ్లి కబురును అందించారు.

రామ్‌లీలా, బాజీరావ్‌ మస్తానీ, పద్మావత్ వంటి చిత్రాల్లో కలిసి నటించిన దీపిక, రణవీర్ లు పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు అందరికీ తెలిసిందే. ఈవెంట్‌ ఏదైనా కలిసే కనిపించేవారు. చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారు. అయితే పెళ్లి గురించి అడిగినప్పుడు మాత్రం ఇద్దరూ ఏం తెలియనట్లుగానే చెప్పుకొచ్చారు. కానీ పెళ్లి మాత్రం నవంబర్‌లో ఉంటుందని ఈ మధ్యే ప్రచారం కూడా జరిగింది. అనుకున్నట్లుగానే అదే నవంబర్‌లో పెళ్లి బాజాలు మోగుతాయంటూ స్వయంగా ఆ జంటే ప్రకటించింది.

తన ప్రియుడు, నటుడు రణ్‌వీర్‌ సింగ్‌తో తనకున్న ప్రేమ నవంబరు 14, 15 వ తేదీల్లో వివాహ బంధంగా మారబోతోందంటూ ట్విట్టర్‌ ద్వారా దీపికా చెప్పుకొచ్చింది. ఇదే విషయాన్ని రణ్‌వీర్‌ కూడా సోషల్‌ మీడియా ద్వారా కన్ఫర్మ్‌ చేశారు. ఆన్‌స్క్రీన్‌లో అద్భుతమైన రొమాన్స్‌తో అదరగొట్టిన ఈ జంట పెళ్లి డేట్‌ ఫిక్స్‌ చేసినా.. ప్లేస్‌ మాత్రం ఎక్కడో చెప్పకుండా సస్పెన్స్‌ను కొనసాగిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories