మరో చరిత్ర సృష్టించిన ఇస్రో

ఇస్రో మరో చరిత్ర సృష్టించింది. శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ మార్క్-3 డీ2 వాహక నౌక...
ఇస్రో మరో చరిత్ర సృష్టించింది. శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ మార్క్-3 డీ2 వాహక నౌక ప్రయోగం విజయవంతమైంది. జీశాట్-29 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి వాహక నౌక ప్రవేశపెట్టింది. మొత్తం 3,423 కిలోల బరువున్న జీశాట్-29 ఉపగ్రహం అన్న దశలను పూర్తి చేసుకొని నిర్ణీత కక్ష్యలోకి చేరుకుంది.
సమాచార వ్యవస్థకు కీలకమైన జీశాట్-29 భారీ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ-మార్క్3 డీ2 రాకెట్ ద్వారా రోదసిలోకి విజయవంతగా పంపారు. రాకెట్ బరువు 640 టన్నులు కాగా, ఉపగ్రహం బరువు 3,423 కిలోలు. భారత్ నుంచి ప్రయోగించిన వాటిలో జీశాట్-29 అత్యంత బరువైనది. షార్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. జీఎస్ఎల్వీ-మార్క్3 డీ2 రాకెట్ 16.43 నిమిషాలలో భూమికి 207కిలో మీటర్ల ఎత్తుకు చేరుకుని జీశాట్-29 ఉపగ్రహాన్ని విజయవంతంగా వదిలిపెట్టింది.
మారుమూల ప్రాంతాల్లో ప్రజల సమాచార అవసరాలను జీ శాట్-29 తీర్చనుంది. జమ్ము-కశ్మీర్, ఉత్తర, ఈశాన్య భారత భూ భాగాలలో ఈ ఉపగ్రహం సేవలు అందించనుంది. కశ్మీర్ లోయలో ఇంటర్నెట్ ప్రసారాలకు ఊతం ఇస్తుంది. మొత్తం పదేళ్లపాటు ఈ ఉపగ్రహం సేవలందించనుంది. బెంగుళూరులోని ఇస్రో శాటిలైట్ సెంటర్, అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ సంయుక్తంగా ఉపగ్రహాన్ని రూపొందించాయి.
Breaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
9 Aug 2022 4:27 AM GMTబీహార్‌లో వేడెక్కిన రాజకీయాలు
9 Aug 2022 3:59 AM GMTకొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలకు అవకాశం
9 Aug 2022 3:40 AM GMTమూసీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం
9 Aug 2022 3:29 AM GMTస్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా ఆర్టీసీ బంపర్ ఆఫర్లు
9 Aug 2022 3:09 AM GMT