ఐపీఎల్ -12 వేలం.. తొలిరోజునే రికార్డుల మోత

ఐపీఎల్ -12 వేలం.. తొలిరోజునే రికార్డుల మోత
x
Highlights

ఐపీఎల్ 12వ సీజన్ వేలం జైపూర్ వేదికగా సంచలనాలతో ప్రారంభమయ్యింది. మొత్తం 70 స్థానాల భర్తీ కోసం భారత్, విదేశీ క్రికెటర్లతో వేలం ప్రారంభించారు. 20 లక్షల...

ఐపీఎల్ 12వ సీజన్ వేలం జైపూర్ వేదికగా సంచలనాలతో ప్రారంభమయ్యింది. మొత్తం 70 స్థానాల భర్తీ కోసం భారత్, విదేశీ క్రికెటర్లతో వేలం ప్రారంభించారు. 20 లక్షల కనీసధరతో వేలంలో ఉన్న భారత దేశవాళీ క్రికెటర్ వరుణ్ చక్రవర్తి రికార్డుస్థాయిలో 8 కోట్ల 40 లక్షల రూపాయలు దక్కించుకొన్నాడు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ ను కింగ్స్ లెవెన్ పంజాబ్ ఈ మొత్తానికి సొంతం చేసుకొంది. మరోవైపు గత సీజన్ వేలం టాపర్, లెఫ్టామ్ ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ కు 8 కోట్ల 50 లక్షల రూపాయల ధరతో రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకొంది. కోటీ 50 లక్షల కనీస ధరతో ప్రారంభమైన ఉనద్కత్ వేలం చివరకు 8 కోట్ల 50 లక్షల రూపాయల ధరతో ముగిసింది. భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ 4 కోట్ల 80 లక్షల రూపాయల ధరకు దక్కించుకొంది. లంబూ ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ కోటీ 10 లక్షల ధరకే ఢిల్లీ జట్టులో చేరాడు.

టీమిండియా మిడిలార్డర్ ఆటగాడు, ఆంధ్ర రంజీ కెప్టెన్ హనుమ విహారిని ఢిల్లీ ఫ్రాంచైజీ 2 కోట్ల రూపాయల ధరకు సొంతం చేసుకొంది. వెస్టిండీస్ టీ-20 కెప్టెన్ కార్లోస్ బ్రాత్ వెయిట్, టీమిండియా స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ లకు సైతం చెరో 5 కోట్ల రూపాయలు చొప్పున ధర పలికింది. సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్, టెస్ట్ క్రికెటర్ చతేశ్వర్ పూజారాలను సొంతం చేసుకోడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories