logo
సినిమా

‘నన్ను బతికించాలని దేవుడిని ప్రార్థించండి’

‘నన్ను బతికించాలని దేవుడిని ప్రార్థించండి’
X
Highlights

బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్.. అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఆ విషయాన్ని ఆయన రీసెంట్ గా ప్రకటించారు....

బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్.. అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఆ విషయాన్ని ఆయన రీసెంట్ గా ప్రకటించారు. ఇప్పుడు ట్విటర్ లో కూడా తన వ్యాధికి సంబంధించిన వివరాలు పెట్టారు. న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ తో తాను బాధపడుతున్నానని.. తాను హాస్పిటల్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నానని.. చాలా కష్టంగా ఉందని చెప్పుకొచ్చారు.

తన ఆరోగ్యం కుదుటపడుతుందన్న నమ్మకం ఉందన్న ఇర్ఫాన్.. బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు చూపిస్తున్న ఆదరాభిమానాలతో జీవితంపై ఆశ పెరుగుతోందని చెప్పారు. కోరుకున్నవి అన్నీ ఇచ్చేలా జీవితం ఉండదన్న ఇర్ఫాన్.. తాను మాత్రం ఇంకా బతికి ఉండాలనే కోరుకుంటున్నాననీ.. ఆరోగ్యంగా తిరిగొస్తానన్న నమ్మకం ఉందనీ చెబుతున్నారు.

ఇర్ఫాన్ త్వరగా కోలుకోవాలని.. మళ్లీ తనకే సాధ్యమైన నటనతో.. అభిమానులను.. సినీ ప్రేక్షకులను అలరించాలని కోరుకుందాం.

Next Story