తిప్పేసిన కుల్‌దీప్‌ దంచేసిన రాహుల్‌

తిప్పేసిన కుల్‌దీప్‌ దంచేసిన రాహుల్‌
x
Highlights

ఓల్డ్ ట్రాఫర్డ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్‌ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని 2 వికెట్లు మాత్రమే కోల్పోయి...

ఓల్డ్ ట్రాఫర్డ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్‌ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది భారత్‌. తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిటీష్ జట్టు జాసన్‌రాయ్, జోస్‌ బట్లర్, భారత బౌలర్లను ఆటాడుకున్నారు. ఓపెనర్ల దూకుడుకు ఇంగ్లండ్ జట్టు ఐదు ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. ఈ దశలో బౌలింగ్‌కు దిగిన కుల్దీప్‌ పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేశాడు. 2వందల పరుగులు చేస్తుందకున్న బ్రిటీష్ జట్టు కుల్దీప్‌ దెబ్బకు 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఒకే ఓవర్‌‌లో మూడు వికెట్లు తీసి భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు కుల్దీప్‌. 160 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఆరంభంలోనే ధావన్‌ వికెట్‌ను కోల్పోవాల్సి వచ్చింది. తర్వాత బ్యాటింగ్ దిగిన కేఎల్ రాహుల్ ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఐపీఎల్‌లో ఫాంనే కొనసాగించాడు. పది ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 54 బంతుల్లోనే సెంచరీ చేసి భారత్‌కు తిరుగులేని విజయాన్ని అందించాడు. మరోవైపు టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో 20 పరుగులు చేసి టీ20ల్లో 2000 పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories