తెలంగాణలో పెరిగిపోతున్న కోడ్ ఉల్లంఘనలు

x
Highlights

కోడ్‌ ఉల్లంఘనలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ఒకరిపై మరొకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. దాంతో...

కోడ్‌ ఉల్లంఘనలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ఒకరిపై మరొకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. దాంతో వేలల్లో కంప్లైంట్లు వచ్చిపడుతున్నాయి. అయితే ఈసీ పదేపదే హెచ్చరిస్తున్నా, బేఖాతరు చేస్తున్నారు. చట్టంలోని లొసుగులతో తప్పించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తెలంగాణలో ఎన్నికల ప్రచారం కాక రేపుతోంది. గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. అయితే వివిధ వర్గాలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఎన్నికల కోడ్‌ను పదేపదే ఉల్లంఘిస్తున్నాయి. కులం, మతం, ప్రాంతం ఆధారంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే అధికారిక నివాసాల్లో రాజకీయ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా, ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. ఎన్నికల సంఘం పదేపదే హెచ్చరిస్తున్నా, పట్టించుకోకుండా, యధేచ్చగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమారే నిస్సహాయత వ్యక్తం చేశారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా కుల, మత, భాష, ప్రాంతీయత ఆధారంగా ఎన్నికల ప్రచార సమావేశాలు నిర్వహిస్తున్నారని, అలాంటి ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

కోడ్‌ ఉల్లంఘనలపై నోటీసులు జారీ చేస్తున్నా, రాజకీయ పార్టీలు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేవారికి, గెలిచిన తర్వాత కూడా ఇబ్బందులు తప్పవని ఈసీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories