Top
logo

రేవంత్‌ నివాసానికి చేరుకున్న ఫోరెన్సిక్‌ నిపుణులు...

రేవంత్‌ నివాసానికి చేరుకున్న ఫోరెన్సిక్‌ నిపుణులు...
X
Highlights

రేవంత్‌రెడ్డి నివాసంలో రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 20 గంటలుగా రేవంత్‌ను విచారిస్తున్న ఐటీ...

రేవంత్‌రెడ్డి నివాసంలో రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 20 గంటలుగా రేవంత్‌ను విచారిస్తున్న ఐటీ అధికారులు.. ఆయనతో పాటు.. ఉదయ్‌ సింహాను కూడా మరోసారి విచారిస్తున్నారు. ఐటీ అధికారులతో పాటు సోదాల్లో ఫోరెన్సిక్‌ నిపుణులు కూడా పాల్గొన్నారు. డాక్యమెంట్లు, సంతకాలు ఇతరత్రా వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. మూడు రోజుల పాటు సెర్చ్‌ వారెంట్‌తో వచ్చిన అధికారులు.. రేవంత్‌రెడ్డి భార్య సమక్షంలో బ్యాంకు లాకర్లు తెరిచారు. సోదాలు రేపు కూడా కొనసాగనున్నాయి. అయితే రేవంత్ రెడ్డి నివాసం వద్ద భారీ పోలీసు బలగాలను మోహరించారు. దీంతో రేవంత్‌ రెడ్డిని అరెస్ట్‌ చేస్తారని ప్రచారం జరుగుతుండంతో ఆయన నివాసం వద్దకు కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున చేరుకుంటున్నారు. అయితే అరెస్టు చేయడానకి రాలేదని కేవలం భద్రత కోసమే వచ్చామని పోలీసు ఉన్నతవర్గాలు తెలిపాయి.

Next Story