logo
జాతీయం

ర‌జ‌నీకాంత్ పై పోటీ చేసి ఆయ‌న్ని ఓడిస్తా : ప‌్ర‌ముఖ‌ డైర‌క్ట‌ర్

ర‌జ‌నీకాంత్ పై పోటీ చేసి ఆయ‌న్ని ఓడిస్తా : ప‌్ర‌ముఖ‌ డైర‌క్ట‌ర్
X
Highlights

ఉత్కంఠకు తెరపడింది. కోట్లాది మంది అభిమానులు, తమిళనాడు ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన ప్రకటి కొత్త...

ఉత్కంఠకు తెరపడింది. కోట్లాది మంది అభిమానులు, తమిళనాడు ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన ప్రకటి కొత్త సంవత్సరానికి ఒక్కరోజు ముందుస్పష్టత ఇచ్చేశారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. రజనీకాంత్ తన పొలిటికల్ ఎంట్రీపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాట్లుగా అధికారికంగా ప్రకటించారు.

ఈ నేప‌థ్యంలో ర‌జ‌నీకాంత్ పై పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు గౌత‌మ‌న్ ప్ర‌క‌టించారు. జ‌ల్లిక‌ట్టు ప్ర‌చార కార్య‌క‌ర్త‌గా పేరు సంపాదించుకున్న గౌత‌మ‌న్..సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ ఏ నియోజ‌క‌వ‌ర్గంలో పోటీచేసినా ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా పోటీ చేస్తాన‌ని స‌వాల్ విసిరారు. అంతేకాదు ర‌జ‌నీ బీజేపీకి మ‌ద్ద‌తుగా పార్టీని ప్రారంభించారని త‌మిళ స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేయ‌కుండా బీజేపీకి వ‌త్తాసు ప‌లుకుతున్నార‌ని మండిప‌డ్డారు. ఇక తనది ఆధ్యాత్మిక రాజకీయం అని ప్రకటించడాన్ని బట్టి సూప‌ర్ స్టార్ బీజేపీకి మద్దతుదారుడని గుర్తు చేశారు. వార‌స‌త్వ రాజ‌కీయాల్ని ప్రోత్స‌హించేలా ర‌జనీకాంత్ త‌న సతీమణి లతా రజనీకాంత్‌ను కూడా రాజకీయ ప్రవేశం చేయించడం తథ్యమని అన్నారు.

Next Story