logo
సినిమా

ఇలియానా పెళ్లైపోయింది!

ఇలియానా పెళ్లైపోయింది!
X
Highlights

దేవ‌దాసు చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి, త‌ర్వాత బాలీవుడ్‌కి వెళ్లిన గోవా బ్యూటీ ఇలియానా ర‌హ‌స్యంగా పెళ్లి...

దేవ‌దాసు చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి, త‌ర్వాత బాలీవుడ్‌కి వెళ్లిన గోవా బ్యూటీ ఇలియానా ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకుంద‌నే పుకార్లు ఇప్పుడు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అందుకు కార‌ణం లేక‌పోలేదు.. క్రిస్‌మ‌స్ సంద‌ర్భంగా ఆమె పెట్టిన ఓ ఇన్‌స్టాగ్రాం పోస్టు ఈ అనుమానాల‌కు తావిస్తోంది. 'సంవత్స‌రంలో నాకు ఇష్ట‌మైన స‌మ‌యమిది. క్రిస్మస్ అంటే తనకెంతో ఇష్టమని, కుటుంబ సభ్యులతో సెలవులు గడపడం సంతోషంగా ఉంటుందని పోస్ట్‌ చేసింది. తాను షేర్‌ చేసిన ఫొటో తన భర్త(హబ్బీ) ఆండ్రూ తీశాడని పేర్కొంది. అతడితో పెళ్లిపోయింది కాబట్టే ఆండ్రూను భర్తగా సంబోధించిందని అభిమానులు అంటున్నారు.

కొంతకాలంగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. 2014లో ముంబై రెస్టారెంట్‌లో జంటగా కెమెరా కంటికి చిక్కారు. అప్పటి నుంచి బాలీవుడ్‌ కార్యక్రమాలు, వేడుకలకు జంటగానే హాజరవుతూ వచ్చారు. తామిద్దరి ఫొటోలను ఇలియానా ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేస్తుండటంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోవడం ఖాయమని అప్పట్లోనే అంతా అనుకున్నారు.

Next Story