logo
సినిమా

పవన్‌కళ్యాణ్‌ పిలిస్తే పార్టీలోకి వెళ్తా..

పవన్‌కళ్యాణ్‌ పిలిస్తే పార్టీలోకి వెళ్తా..
X
Highlights

జనసేన పార్టీకి తాను అవసరమని పవన్ కల్యాణ్, భావించి ఆహ్వానిస్తేనే తాను వెళ్లి ఆ పార్టీలలో చేరుతానని నటుడు,...

జనసేన పార్టీకి తాను అవసరమని పవన్ కల్యాణ్, భావించి ఆహ్వానిస్తేనే తాను వెళ్లి ఆ పార్టీలలో చేరుతానని నటుడు, కమెడియన్ సప్తగిరి వ్యాఖ్యానించాడు. తన తాజా చిత్రం 'సప్తగిరి ఎల్ఎల్ బీ' విజయవంతమైన నేపథ్యంలో సొంత ప్రాంతమైన చిత్తూరు జిల్లాలో పర్యటించిన ఆయన, మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా విలేకర్లు అడిగిన ప్రశ్నలకి సప్తగిరి సమాధానం ఇచ్చారు. పవన్ కల్యాణ్ గురించి ఏం చెబుతారు అని విలేకరి అడిగిన ప్రశ్నకి సప్తగిరి సమాధానం ఇస్తూ.. ‘‘పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు. చిత్తూరు జిల్లా నుంచి వెళ్ళిన వ్యక్తికి హీరో అవుతున్నాడంటే.. సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ సినిమా ఆడియో ఫంక్షన్‌కు వచ్చి తమ్ముడు నీకు నేనున్నానని ఆయన అభయమిచ్చారు..’’ అని తెలిపారు. పవన్‌ కల్యాణ్ పార్టీలోకి వెళ్తారా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘రాజకీయాలపై నాకు అంత అనుభవం లేదు. అయితే పవన్‌ కల్యాణ్ వెంట ఉండటానికి నేను రెడీ. అన్నారు. పవన్‌ సార్‌ పిలిస్తే 100 శాతం వెళ్తాను..’’ అని సప్తగిరి అన్నారు

Next Story