ఐఏఎస్ జోడీ ప్రేమకథ

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఐఏఎస్ జంట టీనా దబి, అథర్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. సరిగ్గా మూడేళ్ల క్రితం...
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఐఏఎస్ జంట టీనా దబి, అథర్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. సరిగ్గా మూడేళ్ల క్రితం సివిల్ సర్వీస్ మొదటి ప్రయత్నంలోనే ఫస్ట్, సెకండ్ ర్యాంక్ సాధించిన ఈ ఐఏఎస్ జంట ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రేమ వివాహం చేసుకొని వార్తల్లోని వ్యక్తులుగా మారారు. తాజాగా వీళ్లిద్దరూ లుంగీ డ్యాన్స్ చేస్తున్న ఫొటోలు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇప్పుడా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వీళ్లిద్దరూ ఐఏఎస్ అధికారులు. పైగా ఒకే బ్యాచ్. అంతేకాదు మతాలు వేరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఉద్యోగ బాధ్యతలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈ యువ జంట లేటెస్ట్ గా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి. ఈ ఇద్దరు ఐఏఎస్‌లు లుంగీ డ్యాన్స్ గెటప్ లో స్టెప్పులు ఇరగదీస్తున్న ఫొటోలు షేర్ చేశారు. ఈ జంట ఐఏఎస్ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు కూడా ఫ్లాష్ మాబ్ తో అదరగొట్టారు.
మతాలు వేరైనా సమాజం నుంచి వ్యతిరేకత వ్యక్తమైనా ఐఏఎస్ టాపర్లు అయిన ఈ ప్రేమజంట ఈ ఏడాది ఏప్రిల్ లో పెళ్లితో ఒక్కటయ్యారు. ఐఏఎస్ శిక్షణలో ఉన్నప్పుడే వీరిద్దరూ ప్రేమించుకున్నారు. శిక్షణ పూర్తయ్యాక నిశ్చితార్థం చేసుకున్న వీరు మూడేళ్ల తర్వాత వివాహం చేసుకోవాలని ముందే నిర్ణయించుకున్నారు. అప్పట్నుంచే వీరి ప్రేమకు సంబంధించిన ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసేవారు. అలా ఈ జంట సోషల్ మీడియాలో పాపులరైంది.
2015 యూపీఎస్సీ పరీక్షల్లో నెంబర్‌వన్ గా నిలిచిన టీనా దబి రెండో ర్యాంకు సాధించిన అత్తర్ అమీర్ ఉల్ షఫీ ఖాన్ తో ప్రేమలో పడింది. షఫీ ఖాన్ కశ్మీరీ ముస్లిమ్. మతాలు వేరైనా అవేమి వాళ్ల ప్రేమకు, పెళ్లికి ఆటంకం కాలేదు. ఈ ఇద్దరు ఐఏఎస్ అధికారుల్లో టీనా దబి నిత్యం నవ్వుతూ ఫొటోలకు ఫోజులివ్వడమే కాదు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పాపులర్ అయ్యారు. ఇప్పుడు లుంగీ డ్యాన్స్‌తో మరోసారి జనం నోటిలో నానుతున్నారు. ఐఏఎస్ అధికారులైనా పని ఒత్తిడిలో వ్యక్తిగత జీవితాన్ని కోల్పోకుండా కాస్త ఆటవిడుపుగా ఒత్తిడిని తగ్గించుకోవాలని సూచిస్తోంది ఈ ఐఎఎస్ జంట.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT