logo
జాతీయం

ప్రభుత్వ పాఠశాలలో ఐఏఎస్ అధికారి కుమార్తె

Highlights

సర్కారీ బడులు ఎంత మాత్రం సబ్ స్టాండర్డ్ కాదంటున్నారు ఓ ఐఏఎస్ అధికారి అవి సరస్వతి నిలయాలేనంటున్నారు తన...

సర్కారీ బడులు ఎంత మాత్రం సబ్ స్టాండర్డ్ కాదంటున్నారు ఓ ఐఏఎస్ అధికారి అవి సరస్వతి నిలయాలేనంటున్నారు తన కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో చదివించడమే కాదు ఆ స్కూళ్లపై సాధారణ జనంలో ఉన్న దురభిప్రాయాన్ని తొలగించేందుకు తన వంతు ప్రయత్నమూ చేస్తున్నారు ఇంతకీ ఎవరా అధికారి?

కార్పొరేట్ విద్యపై మోజుతో ప్రభుత్వ పాఠశాలలను చులకనగా చూసే ఈ రోజుల్లో ఓ ఐఏఎస్ అధికారి తన కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి చదివిస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలు సరస్వతీ నిలయాలంటున్న ఆయన ప్రభుత్వ పాఠశాలలపై అందరి దృష్టి మళ్లేలా తగినంత ప్రచారమూ కల్పిస్తున్నారు. మీరు చూస్తున్న ఈ వ్యక్తి పేరు అవనీష్ శరణ్ ఛత్తిస్ గఢ్ లోని బలరాంపూర్లో ఐఏఎస్ అధికారి సాధారణంగా ఐఏఎస్ అధికారి కుమార్తె అయితే కార్పొరేట్ స్కూల్ లో చదువుతారనుకుంటారు కానీ అవనీష్ కుమార్తె మాత్రం స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్ధిని తన కుమార్తె చదువుతున్న స్కూలు వివరాలు, వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి పాపులర్ కూడా చేస్తున్నారు అవనీష్ అవనీష్ ఛత్తిస్ గఢ్ లోని 44 వేల మంది అంగన్ వాడీ పిల్లలకు పౌష్టికాహారమైన గుడ్డును అందించేందుకు వీలుగా చందాల రూపంలో26 లక్షల రూపాయలను సేకరించారు.

తన కుమార్తె చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలో జరిగే ప్రతీ ఫంక్షన్ కు అవనీష్ తప్పని సరిగా అటెండ్ అవుతారు. అంతేకాదు మధ్యాహ్న భోజనం సమయంలో తరగతి గదిలో తన కుమార్తె పక్కన కూర్చుని భోజనం కూడా చేశారు. అవనీష్ లా అందరూ ప్రభుత్వ పాఠశాలలపై దృక్పథం మార్చుకుంటే సర్కారీ బడులు సరస్వతీ నిలయాలు కాక ఏమవుతాయి?

Next Story