చంపేస్తారని నాన్నకు చెప్పా!

చంపేస్తారని నాన్నకు చెప్పా!
x
Highlights

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన తండ్రి రాజీవ్‌, నానమ్మ ఇందిరాగాంధీ హత్యలపై తొలిసారి నోరు విప్పారు. నాన్న చనిపోయాక చాలా ఏళ్లు బాధపడ్డాం, ఎంతో...

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన తండ్రి రాజీవ్‌, నానమ్మ ఇందిరాగాంధీ హత్యలపై తొలిసారి నోరు విప్పారు. నాన్న చనిపోయాక చాలా ఏళ్లు బాధపడ్డాం, ఎంతో ఆగ్రహానికి గురయ్యాం కానీ ఆయన్ని చంపినవారిని తాము క్షమించేశామంటూ ఉద్వేగానికి లోనయ్యారు. నాన్న, నానమ్మ అలాంటి పరిస్థితుల్లో చనిపోతారని తమ కుటుంబం ముందే ఊహించిందన్నారు. రాజకీయాల్లో తప్పుడు శక్తులకు వ్యతిరేకంగా పోరాడినా, నిలిచినా అలా చనిపోవడం ఖాయమన్నారు. తనకు పద్నాలుగేళ్ల వయసుండగా నానమ్మను చంపేశారు ఆ తర్వాత నాన్నను హత్య చేశారు. దాంతో మా చుట్టూ ఎప్పుడూ 15మంది రేయింబవళ్లూ కాపాలాగా ఉండేవారంటూ తాను పెరిగిన వాతావరణాన్ని గుర్తుచేసుకుని రాహుల్‌ ఉద్వేగానికి లోనయ్యారు. ఎల్టీటీఈ ప్రభాకరన్‌‌ను దారుణంగా చంపినప్పుడు కూడా అతని భార్యా పిల్లలు అనాథలైపోయారని బాధేసిందన్నారు. ప్రియాంక కూడా అలాగే బాధ పడిందని రాహుల్‌ గుర్తుచేసుకున్నారు. తాను చనిపోతానని ముందే తెలుసని నానమ్మ తనకు చెప్పిందన్నారు. అయితే నాన్న చనిపోతారని ఆయనతో తాను ముందే అన్నానన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories