Top
logo

కాసేపట్లో ఐటీ కార్యాలయానికి రేవంత్

కాసేపట్లో ఐటీ కార్యాలయానికి రేవంత్
X
Highlights

ఓటుకు నోటు కేసు నిందితుడు, అక్రమాస్తుల అభియోగాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ...

ఓటుకు నోటు కేసు నిందితుడు, అక్రమాస్తుల అభియోగాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాసేపట్లో ఐటీ విచారణకు హాజరుకానున్నారు. గత నెలలో ఐటీ అధికారులు చేపట్టిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న నగదు, డాక్యుమెంట్లు, ఇతర పత్రాల ఆధారంగా రేవంత్‌ను ఐటీ అధికారులు ప్రశ్నించనున్నారు. దీంతో పాటు ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు ఇచ్చిన 50 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చారు ? ఎవరు ఇచ్చారనే కోణంలో విచారించనున్నారు. ఈ కేసులో రేవంత్‌తో పాటు సెబాస్టియన్‌, ఉదయ్ సింహ, రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి విచారణకు హాజరుకానున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రశ్నాపత్రం సిద్ధం చేసినట్టు సమాచారం.

Next Story