logo
సినిమా

తారక్‌ను రావొద్దని చెప్పా: కల్యాణ్‌రామ్

తారక్‌ను రావొద్దని చెప్పా: కల్యాణ్‌రామ్
X
Highlights

నందమూరి కల్యాణ్‌రామ్ సినిమా ఎమ్మెల్యే ప్రి రిలీజ్ ఈవెంట్‌కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వస్తాడనే టాక్ బయట బాగా...

నందమూరి కల్యాణ్‌రామ్ సినిమా ఎమ్మెల్యే ప్రి రిలీజ్ ఈవెంట్‌కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వస్తాడనే టాక్ బయట బాగా నడిచింది. కానీ ఆయన దీనికి హాజరు కాలేదు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో కల్యాణ్ రామ్ స్పందించాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తారక్‌ను తానే వద్దని చెప్పానని కల్యాణ్ రామ్ తెలిపాడు. ప్రస్తుతం ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రం కోసం కొత్త లుక్‌ను ప్రయత్నిస్తున్నాడని, అది అభిమానులకు సర్‌ప్రైజ్‌ అని.. ఒకవేళ ఇప్పుడు ఫంక్షన్‌కు వస్తే ఆ లుక్ బయటపడుతుందనే ఉద్దేశ్యంతోనే వద్దని చెప్పానని పేర్కొన్నాడు. ఇక ఫంక్షన్‌కు వచ్చేముందు కూడా ఎన్టీఆర్‌ను కలిసే వచ్చానని.. ఈ కార్యక్రమానికి రాలేనందుకు అతడు చాలా ఫీల్ అయ్యాడని తెలిపాడు.

Next Story