logo
సినిమా

స్పైడ‌ర్ వివాదంలో ర‌కుల్ ప్రీత్ సింగ్

స్పైడ‌ర్ వివాదంలో ర‌కుల్ ప్రీత్ సింగ్
X
Highlights

హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ నోరు జారిన‌ట్లు తెలుస్తోంది. ఇండ‌స్ట్రీలో త‌న ఫ్రెండ్లీ నేచ‌ర్ తో అభిమానుల్ని...

హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ నోరు జారిన‌ట్లు తెలుస్తోంది. ఇండ‌స్ట్రీలో త‌న ఫ్రెండ్లీ నేచ‌ర్ తో అభిమానుల్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ..చాలా త్వ‌ర‌గా స్టార్ డ‌మ్ సంపాదించింది. వివాదాల జోలికి వెళ్ల‌కుండా త‌న‌పని తాను చేసుకొని వెళుతుంది కాబ‌ట్టే ఈ స్టార్ స్టేట‌స్ వ‌చ్చింద‌ని ఆమె స‌న్నిహితులు అంటుంటారు.

కాగా ఆమె స్పైడ‌ర్ మూవీ వివాదంలో చిక్కుకుంది. స్పైడ‌ర్ మూవీకి ముందు మ‌హేష్ బాబుతో, డైర‌క్ట‌ర్ ముర‌గాదాస్ తో ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని..ఇలాంటి పాత్రలు తాను గ‌తంలో చేయ‌లేద‌ని ఆకాశానికెత్తేసింది. కానీ స్పైడ‌ర్ డిజాస్ట‌ర్ త‌రువాత ఇంగ్లిష్ డైలీ ఇంట‌ర్వ్యూలో డిజాస్ట‌ర్ పై నోరు జారీ.. ఆ సినిమా గురించి తాను ఎక్కువ మాట్లాడలేనని చెప్పుకొచ్చింది. డిజాస్ట‌ర్ అవ్వ‌డంపై తానీ వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని .. ఐతే ఆ సినిమాకు పని చేసిన అనుభవం తనకంత సంతృప్తినివ్వలేదని ఆమె వ్యాఖ్యానించింది. ఇక‌డైర‌క్ట‌ర్ ముర‌గ‌దాస్ గురించి ప్ర‌స్తావిస్తూ ఆయ‌న‌తో ప‌నిచేయ‌డం కోసం ఎంతో కాలం ఎదురు చూశా. ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న‌తో ప‌నిచేస్తాన‌ని అంది. ర‌కుల్ వ్యాఖ్య‌ల‌పై మ‌హేష్ అభిమానులు మండిప‌డుతున్నారు. హిట్ అయితే ఒక‌లాగా ఫ‌ట్ అయితే మ‌రోలా మాట్లాడ‌డం త‌గ‌ద‌ని అంటున్నారు. దీనిపై వివాదం రాజుకోవడంతో తన వ్యాఖ్యల్ని మిస్ కోట్ చేశారంటూ అందరిలాగే మీడియాపై ఫైర్ అయింది రకుల్.

Next Story