నాకు సీఎం కావాలనే కోరిక లేదు: కేటీఆర్‌

నాకు సీఎం కావాలనే కోరిక లేదు: కేటీఆర్‌
x
Highlights

తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభద్రతాభావంతో ఉన్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో వందసీట్లతో అధికారంలోకి...

తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభద్రతాభావంతో ఉన్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో వందసీట్లతో అధికారంలోకి వస్తామని ఆయన పునరుద్ఘాటించారు. మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు సీఎం కావాలనే ఆలోచన లేదన్నారు. మంత్రి హరీశ్‌తోనూ, పార్టీలోని ఇతర నేతలతో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. తామంతా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రాజకీయాలు, అధికారం కంటే కుటుంబసభ్యుల మధ్య ఉన్న అనుబంధం చాలా గొప్పదని, దాన్ని ఎప్పుడూ వీడబోమని కేటీఆర్‌ అన్నారు. మహాకూటమి పుంజుకునే పరిస్థితే లేదని, తెలంగాణలో సెటిలర్స్‌ తమ వైపే ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ను అడ్డుపెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ రూపంలో తెలంగాణలో ప్రవేశించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. మరో పదిహేనేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటారని‌ స్పష్టం చేశారు. 105 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించడం సాహసోపేతమైన నిర్ణయమని, తెరాసలో అసమ్మతి పూర్తిగా చల్లారిందని ఆయన వివరించారు. భాజపా ఐదు సిట్టింగ్‌ స్థానాల్లోనూ ఈసారి తెరాసయే విజయం సాధిస్తున్న కేటీఆర్‌ జోస్యం చెప్పారు. తెరాస సొంతంగా అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ఆయన వివరించారు.

హరీశ్‌రావు గురించి దిక్కుమాలిన ఆరోపణలు చేస్తున్నారు. నాకు, హరీశ్‌రావుకు కుటుంబమే ఫస్ట్‌ ఆ తర్వాతే రాజకీయాలు అంటూ తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కె.తారకరామారావు వ్యాఖ్యానించారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌లో పుట్టిన చంద్రబాబు కాంగ్రెస్‌లోకే వెళ్లారంటూ ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీకి ఇప్పటికి టీడీపీకి సంబంధమే లేదని ఆరోంపించారు. కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తును తెలుగు ప్రజలు సహించడం లేదని తెలిపారు. సీఎం రమేష్‌పై ఐటీ దాడులు జరిగితే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

చంద్రబాబుకు దేని గురించో భయం ఉంది అదేంటో త్వరలోనే తేలుతుందని వెల్లడించారు. దీపావళి తర్వాతే మేనిఫెస్టో ప్రకటిస్తామన్నారు. కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. ఎన్నికల్లో వంద స్థానాలు తగ్గకుండా గెలుస్తామని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. హరీశ్‌రావ్‌పై వచ్చే ఆరోపణలన్ని అవాస్తవాలేనంటూ కొట్టిపారేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఎంఐఎం తమకు సాయం చేసిందని అందుకే ఎంఐఎంతో దోస్తి చేస్తున్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు.

కేసీఆర్ ఇంకా 15 ఏళ్ళు సీఎంగా ఉండాలని తమ ఆకాంక్ష అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన చిట్ చాట్‌గా మాట్లాడుతూ హరీశ్‌రావుపై విపక్షాలు కూడా దిక్కుమాలిన ఆరోపణలు చేశాయని మండిపడ్డారు. హరీశ్‌కు తనకు కుటుంబం ఫస్ట్ అని, ఆ తర్వాతే రాజకీయాలని కేటీఆర్‌ అన్నారు. కేసీఆర్ గజ్వేల్‌లో లక్ష మెజారిటీతో గెలుస్తారన్నారు. బీజేపీకి 70 మంది అభ్యర్థులకే దిక్కు లేదని... ఇంకా 70 స్థానాలు ఎలా గెలుస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. వంద స్థానాల్లో బీజేపీ డిపాజిట్లు గల్లంతేనని ఆయన జోస్యం చెప్పారు. బీజేపీ సిట్టింగ్‌ స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలుపుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. కర్ణాటక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ది అసాధారణ గెలుపేమీ కాదని మంత్రి కేటీఆర్ అన్నారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోని పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ మాత్రమేనని కేటీఆర్ అన్నారు. మంత్రి కేటీఆర్ ఇవాళ మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా మాట్లాడుతూ.. దీపావళి తర్వాత మేనిఫెస్టో ప్రకటిస్తామన్నారు. మా ఆర్థిక విధానం ఆదాయం పెంచాలన్నారు. కేసీఆర్‌ను చూసి ఓటేస్తామని సామాన్య ప్రజలు అంటున్నారు. 100 స్థానాలు తగ్గకుండా గెలుస్తమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇంకా 15 ఏళ్లు సీఎంగా కేసీఆర్ ఉండాలన్నది నాది, పార్టీ, హరీష్‌రావు నిర్ణయమన్నారు.

2014లోనే కోదండరాం తన అనుచరులను టికెట్లు ఇప్పించుకున్నారని కేటీఆర్ అన్నారు. కూటమి కొత్తేమీ కాదు. కాంగ్రెస్ హామీల చిట్టా చూస్తే అవి ఆపద మొక్కులే అనిపిస్తున్నదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. హైకోర్టు విభజన ఎప్పుడో జరగాలి. ఎన్నికల తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ను మ్యూజియంగా మారుస్తారు. బీజేపీకి 70 మంది అభ్యర్థులే దిక్కులేరు..70 స్థానాలు ఎలా గెలుస్తారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అమ్మనా బొమ్మనా అని ఆవేశంతో అంటే నానా రాద్దాంతం చేసిన కాంగ్రెస్ నేతలు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఎందుకు మాట్లాడరని కేటీఆర్ ప్రశ్నించారు. కూటమి పుంజుకునే పరిస్థితి లేదు. అసంతృప్తులన్నీ సద్దుమణిగాయి. రాహుల్, సోనియా ప్రచారంతో ఏదో ఒరిగిపోతుందనుకోవడం లేదన్నారు. కూటమి అభ్యర్థులను ప్రకటించాక మాకు అనుకూలంగా మారుతుంది.
2009లో పొత్తు పెట్టుకుని దెబ్బతిన్నమని అభ్యర్థులను మర్చేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో కులపిచ్చి లేదు..ఏపీలో మాత్రమే కులం బలమైన అంశమని చెప్పారు. 2004లో హైదరాబాద్ అభివృద్ధి చేశామని చంద్రబాబు చెప్పినా ఒక్క సీటు రాలేదు. 2014లో మాపై కొన్ని అనుమానాలున్నాయి. అందుకే గ్రేటర్‌లో మాకు సీట్లు రాలేదు. పరిస్థితులు మెరుగుపడి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అసాధారణ విజయం సాధించామని కేటీఆర్ పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories