నన్ను రేప్ చేసి, చంపేస్తారేమో

సంచలనం సృష్టించిన కథువా కేసును వాదిస్తున్న లాయర్ వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. హిందూ-ముస్లిం విబేధాల...
సంచలనం సృష్టించిన కథువా కేసును వాదిస్తున్న లాయర్ వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. హిందూ-ముస్లిం విబేధాల పొడచూసిన నేపథ్యంలో కథువా బాలిక హత్యాచారం కేసు విచారణ కోసం జమ్ముకశ్మీర్ ప్రభుత్వం ఇద్దరు సిక్కు మతస్తులైన లాయర్లను పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా నియమించింది. కాగా, బాధితురాలి కుటుంబ తరఫున వాదిస్తానని అడ్వొకేట్ దీపికా సింగ్ రజావత్ ఇదివరకే ముందుకొచ్చారు. సోమవారం నాటి విచారణలో ఆమె వాదనే కీలకం కానుంది. దీపికా ఈ కేసును అంగీకరించింది మొదలు ఆమెకు పెద్ద ఎత్తున బెదింపులు వస్తుండం తెలిసిందే. ఆదివారం కూడా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తనకు ఫోన్ చేశారని, ఈ కేసు వాదిస్తే రేప్‌చేసి చంపేస్తామని బెదిరించారని ఆమె మీడియాతో చెప్పారు.ఆ బాలిక మాదిరిగానే తనను కూడా రేప్ చేసి చంపేస్తారేమోనన్నారు దీపికా రాజావత్. అసలు తాను ఎన్నిరోజులు బతికుంటానో తెలియదని, అందుకే రక్షణ కల్పించాలని న్యాయస్థానాన్ని కోరతానన్నారు. తాను ప్రమాదంలో ఉన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తానని అన్నారు దీపికా. ఇప్పటికే బెదిరింపులు వస్తున్నాయని, దాడులు కూడా జరిగే అవకాశముందనే అనుమానాల్ని వ్యక్తంచేశారు.
అలాగే జమ్మూ బార్ అసోసియేషన్ నుంచి కూడా తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించారు. తాను బార్ అసోసియేషన్‌లో సభ్యురాలిని కాదని, ఈ కేసు నుంచి తప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారన్నారు. తనకు ఎన్ని బెదిరింపులు వచ్చినా న్యాయం కోసం పోరాడతానని తేల్చిచెప్పేశారు. మరోవైపు ఆమెకు కోర్టు ప్రాంగణంలో తగిన భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. దీపికా ఇప్పటికే ఓ రేప్ కేసుని వాదిస్తున్నారు, అంతేకాదు వాయిస్ ఫర్ రైట్స్ పేరుతో ఎన్జీవోను కూడా నడుపుతున్నారు.
"I can be raped, killed": Lawyer for Kathua child's family alleges threat https://t.co/D0ed0ngFmX#KathuaCase pic.twitter.com/LBWJfHwLc5
— NDTV (@ndtv) April 16, 2018
గోరంట్ల మాధవ్ విషయంలో అతిగా స్పందించొద్దు.. వంగలపూడి అనితకు బెదిరింపు కాల్స్..
9 Aug 2022 10:22 AM GMTJayasudha: బీజేపీలోకి సినీనటి జయసుధ...?
9 Aug 2022 8:03 AM GMTటీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై కేసు నమోదు
9 Aug 2022 7:50 AM GMTTelangana News: వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియపై హైకోర్టు స్టే
8 Aug 2022 9:38 AM GMTBreaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMT
ఆ అభిమానంతోనే 'నారప్ప' చేయలేదన్న దర్శకుడు హను రాఘవపూడి
9 Aug 2022 11:30 AM GMTఈనెల 11న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలపై చర్చ..
9 Aug 2022 11:04 AM GMTNitish Kumar: బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా
9 Aug 2022 10:49 AM GMTRashmika Mandanna: కష్టానికి అదృష్టం తోడైంది...
9 Aug 2022 10:39 AM GMTగోరంట్ల మాధవ్ విషయంలో అతిగా స్పందించొద్దు.. వంగలపూడి అనితకు బెదిరింపు...
9 Aug 2022 10:22 AM GMT