logo
సినిమా

తనకింకా 16 యేళ్లేనన్న స్టార్ హీరోయిన్!

తనకింకా 16 యేళ్లేనన్న స్టార్ హీరోయిన్!
X
Highlights

మీకు ఈ మధ్యనే 32 వచ్చాయి కదా.. అని అంటే, అబ్బే.. అలాంటిదేమీ లేదని అంటోంది శ్రుతి హాసన్. చాలా మంది హీరోయిన్లు...

మీకు ఈ మధ్యనే 32 వచ్చాయి కదా.. అని అంటే, అబ్బే.. అలాంటిదేమీ లేదని అంటోంది శ్రుతి హాసన్. చాలా మంది హీరోయిన్లు వయసును దాచేస్తూ ఉంటారు. అయితే శ్రుతి హాసన్ కు ఆ అవకాశం లేదు. కమల్ హాసన్ కూతురు కాబట్టి.. ఈమె ఎప్పుడుపుట్టిందనే అంశానికి చాలా ప్రచారమే ఉంటుంది. ఈ నేపథ్యంలో తన వయసు విషయంలో శ్రుతి తేలికగా స్పందిస్తోంది. తనకు ముప్పై రెండు అనే విషయాన్ని ఈమె ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే.. తనకు పదహారవ యేటతోనే వయసు పెరగడం ఆగిపోయిందని శ్రుతి చెబుతోంది. వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే… నా మనసులో నాకెప్పుడూ పదహారేళ్లే అంది. వయసు పెరుగుతోందని సినిమాల్లో అవకాశాలు రావనే భయమే తనకు లేదంది. తన గ్లామర్ క్రెడిట్ అంతా మ్యూజిక్ కే దక్కుతుందని.. సంగీతం తనను నిత్యయవ్వనురాలిని చేస్తోందని చెప్పింది. మ్యూజిక్ మూడ్ లోకి వెళ్లిపోయాకా.. వేరే విషయాలేవీ గుర్తుకురావని చెప్పుకొచ్చింది.

Next Story