logo
సినిమా

పవన్ కోసం 10, త్రివిక్రమ్ కోసం 3సార్లు..

X
Highlights

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్‌లో ‘అజ్ఞాతవాసి’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈరోజు ...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్‌లో ‘అజ్ఞాతవాసి’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈరోజు విడుదలైన ‘అజ్ఞాతవాసి’ సినిమాను చూశానని, తనకు నచ్చిందని ‘జబర్దస్త్ ’ నటుడు ‘హైపర్’ ఆది అన్నాడు. ఈరోజు ఆయన మాట్లాడుతూ...తమ్ముడు, తొలిప్రేమ సమయంలో పవన్ లో ఉన్న కామెడీ టైమింగ్ మళ్లీ ఈ చిత్రంలో చూడొచ్చని తెలిపారు. ఈ సినిమా గురించి పూర్తిగా చెప్పాలంటే పవన్ కోసం పదిసార్లు, త్రివిక్రమ్ కోసం మూడుసార్లు, కీర్తీ సురేష్, అను ఇమ్మాన్యూల్, మురళీ శర్మ, రావు రమేష్ల కోసమైతే వీలున్నప్పుడల్లా వెళ్లి చూడొచ్చన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అజ్ఞాతవాసి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అన్నారు. సీరియస్గా చాలా చాలా బాగుందని చెప్పారు. ఈ చిత్రంలో బొమన్ ఇరానీ చెప్పే డైలాగ్, ‘రాజ్యం మీద ఆశ లేనోడికంటే గొప్పరాజు ఎవడుంటాడు’ తనకు బాగా నచ్చిందని, పవన్ కల్యాణ్ కు కరెక్టుగా సరిపోయే డైలాగ్ ఇదని అన్నాడు.

Next Story