logo
సినిమా

జబర్దస్త్‌కి వెళ్దామని రాలేదు: హైపర్ ఆది

జబర్దస్త్‌కి వెళ్దామని రాలేదు: హైపర్ ఆది
X
Highlights

తెలుగు బుల్లితెరపై జబర్ధస్త్ కామెడీ షో ఎంత గొప్ప పాపులారిటీ సంపాదించిందో అందరికీ తెలిసిందే. ఈ మద్య జబర్ధస్త్...

తెలుగు బుల్లితెరపై జబర్ధస్త్ కామెడీ షో ఎంత గొప్ప పాపులారిటీ సంపాదించిందో అందరికీ తెలిసిందే. ఈ మద్య జబర్ధస్త్ అంటే హైపర్ ఆది పేరు బాగా వినిపిస్తుంది. మనోడు వేసే పంచ్ డైలాగ్స్ కి కడుపుబ్బా నవ్వుతారు. కాస్త వ్యంగంగా ఉన్నా హైపర్ ఆది వేసే జోక్స్, పంచ్ డైలాగ్ తెలుగు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల ఓ షోలో పాల్గొన్న ఆది తాను జబర్దస్త్‌కి రావడానికి కారణాలను వెల్లడించాడు. ‘‘జబర్దస్త్‌లోకి వెళ్దామన్న సెన్స్‌తో రాలేదు. ఒకచోట కూర్చొని చేసే జాబ్ నాకు బోర్ కొట్టేసింది. నాకు సరదాగా పక్కన వాళ్లను ఎంటర్‌టైన్ చేయడం వంటి ఇంట్రస్ట్ ఎక్కువగా ఉండేది. దానికి ఏది యాప్ట్ అని ఆలోచిస్తే ఇది కనిపించింది. అలా కనపడి రావడమే తప్ప ముందునుంచి జబర్దస్త్‌కి వెళ్లాలి అన్న సెన్స్‌తో రాలేదు.’’

‘‘ఫ్రెండ్స్‌తో చిన్న చిన్న షార్ట్ ఫిలింస్ చేసి యూ ట్యూబ్‌లో పెట్టాను. లక్షల మంది చూడటం.. దానిని ఫేస్‌బుక్‌లో పెడితే అదిరే అభి అన్న చూసి.. ‘సూపర్ బ్రదర్.. ఒకసారి వచ్చి కలువు’ అని మెసేజ్ పెట్టాడు. అప్పుడు అక్కడికి వెళ్లి అక్కడున్న ఆర్టిస్టులందరితో ఫోటోలు దిగి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశాను. 2-3 లైకులు వచ్చే నాకు ఒక్కసారే 200-300 లైక్స్ రావడం మొదలయ్యాయి. మనం ఫోటోలు దిగితేనే ఇలా ఉంటే.. మనం కూడా టీంలో ఉంటే ఎలా ఉంటుందో అనిపించింది. అలా జబర్దస్త్‌కి వచ్చాను’’ అంటూ చెప్పుకొచ్చాడు హైపర్ ఆది.

Next Story