logo

వందేళ్ల చరిత్రను బ్రేక్ చేసిన డిసెంబర్

వందేళ్ల చరిత్రను బ్రేక్ చేసిన డిసెంబర్

ఈ సంవత్సరంలో డిసెంబర్ నెల వందేండ్ల చరిత్రను బ్రేక్ చేసింది. గురువారం సాయంత్రం నుండి హైదరాబాద్ నగరంలో ఆకాశం మొత్తం మేఘావృతమైంది. నిన్న రాత్రి నుండి నేటి ఉదయం 8:30 గంటల వరకు రికార్డు స్థాయిలో 46.6మి. మీటర్ల వర్షపాతం నమోదైంది. 1918వ సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన భాగ్యనగరంలో 44.5 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతారణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆ రోజు నుండి నేటి వరకు డిసెంబర్ నెలలో ఈ విధంగా అత్యధికంగా వర్షపాతం నమోదు కాలేదని స్పష్టం చేసింది. నిన్న రాత్రి నుండి ఎడతెరిపిలేని వర్షానికి భాగ్యనగరం చుట్టూ ఉన్న మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. మరో 12 గంటల పాటు వాతావరణం చల్లగా ఉండి చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

chandram

chandram

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top