Top
logo

స్పా ముసుగులో వ్యభిచారం

స్పా ముసుగులో వ్యభిచారం
X
Highlights

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ స్పా సెంటర్‌‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. స్పా ముసుగులో అసాంఘిక...

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ స్పా సెంటర్‌‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. స్పా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్న స్టూడియో మేకర్స్ స్పా సెంటర్‌పై దాడులు నిర్వహించి ఆరుగురు సిబ్బంది, వివిధ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. స్పా సెంటర్‌‌ను సీజ్‌ చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న స్పాసెంటర్ నిర్వాహకుడు సతీష్‌ కోసం గాలిస్తున్నారు. రోడ్‌ నెం. 12లో హైలైన్‌ కాంప్లెక్స్‌ రెండో అంతస్తులో ఫ్లాట్‌ నంబర్‌ 205లో స్టూడియో మేకర్స్‌ స్పా పేరుతో కొనసాగుతున్న ప్లాట్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ సీఐ గట్టు మల్లు ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఇందులో మసాజ్‌కు సంబంధించిన ఎలాంటి పరికరాలు లేకపోగా గదుల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలింది. రెడ్‌హ్యాండెడ్‌గా విటులు, యువతులను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులు కే.ఎం.సంతోష్, హేమంత్, చైతన్య, గణేష్, మణికంఠన్‌ తదితరులను అరెస్ట్‌ చేశారు. నలుగురు యువతులను పునరావాస కేంద్రా నికి తరలించారు. వీరి నుంచి నగదు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Next Story