నిలిచిన హైదరాబాద్‌ మెట్రో సేవలు

నిలిచిన హైదరాబాద్‌ మెట్రో సేవలు
x
Highlights

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన‌ మెట్రో రైలు నగరంలో పరుగులు పెడుతుంది. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం, కాలుష్యానికి దూరంగా, సౌకర్యవంతమైన ప్రయాణం, తక్కువ...

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన‌ మెట్రో రైలు నగరంలో పరుగులు పెడుతుంది. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం, కాలుష్యానికి దూరంగా, సౌకర్యవంతమైన ప్రయాణం, తక్కువ ఖర్చులు ఇలా అన్ని అంశాలతో ముడిపడి ఉన్న మెట్రో రైలు సేవలు న‌వంబ‌ర్ లో ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ మెట్రో రైలును ప్రారంభించిన విష‌యం తెలిసిందే. అయితే ప్రారంభంలో ఎలా ఉన్నా రాను రాను మెట్రో రైలు ప‌నితీరుపై ప్ర‌యాణికులు ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం మెట్రో రైలు ప్ర‌యాణికుల్ని అస‌హ‌నానికి గురిచేస్తుట్లు వార్త‌లు వ‌చ్చాయి. స‌మ‌యపాల‌న లేకుండా మెట్రోరైలు ప‌లు ప్రాంతాల్లో ఆగిపోతుందని..దీంతో అస‌హ‌నానికి గురై సుదూర ప్రాంతాల‌కు వెళ్లే ప్ర‌యాణికులు బ‌స్సుల్ని ఆశ్ర‌యిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌ మెట్రో రైలు ఆదివారం ఉదయం సాంకేతిక లోపంతో అమీర్‌పేట స్టేషన్‌లో నిలిచిపోయింది. దీంతో అమీర్‌పేట్‌- నాగోల్‌ మధ్య సుమారు రెండు గంటల పాటు మెట్రో సేవలకు అంతరాయం కలిగింది. అప్ర‌మ‌త్త‌మైన మెట్రో అధికారులు అమీర్‌పేటలో నిలిచిన రైలును ప్రకాశ్‌నగర్‌లోని అదనపు ట్రాక్‌పైకి తీసుకురావడంతో మిగిలిన రైళ్ల సేవలకు అడ్డంకి తొలగింది. దీంతో రెండు గంటల విరామం తర్వాత మెట్రో సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories