Top
logo

మనమే టాప్..తాగడం మొదలు పెడితే తగ్గేది లేదంటున్న భాగ్యనగరవాసులు

మనమే టాప్..తాగడం మొదలు పెడితే తగ్గేది లేదంటున్న భాగ్యనగరవాసులు
X
Highlights

మద్యం అమ్మకాలలో మన తెలంగాణ టాప్. అందులో హైదరాబాద్ నగరం ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. అయితే ఈ సారి విదేశీ మద్యం...

మద్యం అమ్మకాలలో మన తెలంగాణ టాప్. అందులో హైదరాబాద్ నగరం ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. అయితే ఈ సారి విదేశీ మద్యం కొనుగోళ్లలోనూ దూసుకుపోతున్నారు మన భాగ్యనగరవాసులు. అదేంటో ఓసారి చూడండి.

తెలంగాణ ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో సింహభాగం.. మద్యం అమ్మకాలదే. అయితే నెలకు అమ్ముడవుతున్న రూ. 400 కోట్ల రూపాయల విలువైన మద్యంలో 75 కోట్ల రూపాయలు కేవలం విదేశీ మద్యం నుంచే వస్తోంది. అంటే విదేశీ మద్యానికి నగరంలో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఇట్టే అర్థమవుతోంది.

ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ లాంటి ప్రాంతాలలో వినియోగదారుల అభిరుచి మేరకు విదేశీ మద్యాన్ని ఎక్కువగా సరఫరా చేస్తున్నారు. ఫారిన్ సరుకుకు డిమాండ్ పెరగటంతో బార్ల యజమానులు అబ్కారీ శాఖ నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకొని మరీ విదేశీ మద్యాన్ని అమ్ముతున్నారు.

నగరంలో రోజుకు సుమారు 10 లక్షల లీటర్ల బీర్లలో 3 లక్షల బీర్లు ఫారిన్ వేనని, 5 లక్షల లీటర్ల మద్యంలో 2 లక్షల లీటర్లు విదేశీ మద్యమేనని అబ్కారీ అధికారులు లెక్కలు చెబుతున్నారు. రోజువారి లెక్కలతో పోల్చితే వీకెండ్స్ లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరుతున్నాయి అంటున్నారు షాపుల యజమానులు.

తాగడం మొదలు పెడితే తగ్గేది లేదంటున్న భాగ్యనగరవాసులు స్వదేశీయే కాదు విదేశీ మందును కూడా వదలం అంటున్నారు. గతంలో ఫారిన్ సరుకును తెలిసినవారితో విదేశాలనుంచి తెప్పించుకునే వాళ‌్లమని ప్రస్తుతం తమ గల్లీల్లోనే దొరుకుతోందని చెబుతున్నారు.

Next Story