హైదరాబాద్‌లో వర్నకట్న బాధితురాలు...ఉన్నత ఉద్యోగం చేస్తూ అదనపు కట్నం కోసం వేధింపులు

x
Highlights

కాసుల ముందు అగ్ని సాక్షిగా చేసిన బాసలు బూడిదయ్యాయి. అర్ధేచా, మోక్షేచా, కామేచా అంటూ పంచభూతాల సాక్షిగా వేదమంత్రాల నడుమ ఇచ్చిన మాట గాల్లో దీపంగా మారింది....

కాసుల ముందు అగ్ని సాక్షిగా చేసిన బాసలు బూడిదయ్యాయి. అర్ధేచా, మోక్షేచా, కామేచా అంటూ పంచభూతాల సాక్షిగా వేదమంత్రాల నడుమ ఇచ్చిన మాట గాల్లో దీపంగా మారింది. అదనపు కట్నం కోసం అత్తింటి వారి వేధింపులతో యువతి రోడ్డుపాలైన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.

పద్మారావ్‌ నగర్ కు చెందిన స్టాఫ్ట్‌వేర్ ఉద్యోగి నిఖిల్ కుమార్‌కి వరంగ‌ల్‌కి చెందిన యువతితో 2016 ఆగస్టు 28న పెద్దలు వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో 18 తులాల బంగారంతో పాటు కిలో వెండి, నగదు అందజేశారు. అప్పటికే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న భార్యపై అనుమానాం పెంచుకున్న నిఖిల్ బలవంతంగా ఉద్యోగం మాన్పించారు. అనంతరం ఆరు నెలలకే అదనపు కట్నం తేవాలంటూ వేధించండం ప్రారంభించాడు.

అదనపు కట్నం తెచ్చేందుకు నిరాకరించడంతో భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. దీంతో పాటు విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించాడు. అయితే తమ దగ్గరి నుంచి డబ్బు, బంగారం, తీసుకుని తనను ఇంటి నుంచి వెళ్లగొట్టాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై 498 ఏ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దశలోనే ఇంట్లోని తన సర్టిఫికేట్లతో పాటు బంగారం, ఇతర వస్తువులు ఇవ్వాలంటూ భార్య కోర్టును ఆశ్రయించింది. దీనికి కోర్టు అనుమతి ఇవ్వడంతో ఈ రోజు ఉదయం భర్త ఇంటికి చేరుకుంది.

అప్పటికే ఇంట్లోని బీరువాతో పాటు వస్తువులను బయటపడేసిన భర్త బంగారం, సర్టిఫికేట్లు తనకు తెలియదంటూ బయటకు గెంటేశాడు. దీంతో అక్కడ భైఠాయించిన బాధితురాలు తల్లిదండ్రులు, బంధువులతో కలిసి ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకున్న చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త కుటుంబీకులతో మాట్లాడి సరిఫికేట్లు ఇవ్వాలంటూ సూచించారు. అయితే తమ దగ్గర ఎలాంటి సర్టిఫికేట్లు లేవని చెప్పడంతో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories