ఆదర్శ స్కాంలో మాజీ సీఎంకు భారీ ఊరట

ఆదర్శ స్కాంలో మాజీ సీఎంకు భారీ ఊరట
x
Highlights

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌కు భారీ ఊరట లభించింది. ఆదర్శ హౌసింగ్‌ సోసైటీ కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అశోక్‌ చవాన్‌ను...

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌కు భారీ ఊరట లభించింది. ఆదర్శ హౌసింగ్‌ సోసైటీ కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అశోక్‌ చవాన్‌ను విచారించాలంటూ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అయితే గవర్నర్‌ ఇచ్చిన అనుమతిని జస్టిస్ రంజిత్ మోరే, జస్టిస్ సాధన జాదవ్ డివిజన్ బెంచ్ రద్దు చేసింది. గవర్నర్‌కు సీబీఐ సమర్పించిన పత్రాలను విశ్వసనీయ తాజా సాక్ష్యంగా పరిగణించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అశోక్ చవాన్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ విద్యా సాగర్ రావు 2016 ఫిబ్రవరిలో అనుమతి ఇచ్చారు. దీనిపై అశోక్ చవాన్ హైకోర్టును ఆశ్రయించారు. నేరపూరిత కుట్ర, మోసం, అవినీతికి పాల్పడినట్లు చవాన్‌పై ఆరోపణలు ఉన్నాయి. అదనపు ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్‌ను చవాన్ ఆమోదించారని, ఆయన తన బంధువుల నుంచి రెండు ఫ్లాట్లను తీసుకున్నారని సీబీఐ ఆరోపించింది. ఈ స్కాం తర్వాత అశోక్‌ చవాన్‌ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories