logo
సినిమా

విడాకులు తీసుకున్న ఆ జంటకు మళ్లీ పెళ్లి?

విడాకులు తీసుకున్న ఆ జంటకు మళ్లీ పెళ్లి?
X
Highlights

బాలీవుడ్ కపుల్ హృతిక్‌రోషన్, సుసానె ఖాన్ చాన్నాళ్ల కిందటే తమ వైవాహిక బంధానికి తెర దించారు. విడాకులతో ఎవరి దారి ...

బాలీవుడ్ కపుల్ హృతిక్‌రోషన్, సుసానె ఖాన్ చాన్నాళ్ల కిందటే తమ వైవాహిక బంధానికి తెర దించారు. విడాకులతో ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. అయితే ఈ ఇద్దరూ మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారని రెండు రోజులుగా బాలీవుడ్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ ఇద్దరూ విడాకులు తీసుకున్నా.. చాలా రోజులుగా పిల్లల కోసం మళ్లీ కలిసి తిరుగుతూనే ఉన్నారు. హాలిడే టూర్లకు కూడా వెళ్తున్నారు. పెళ్లి అనే బంధం ఒక్కటి లేకపోయినా.. అంతకుముందు కలిసి ఉన్నట్లే ఇప్పుడూ ఈ జంట కలిసే ఉంటున్నది. ఇద్దరం కలిసే తమ పిల్లలు హృహాన్, హృదాన్‌ల బాగోగులు చూసుకుంటామని గతంలోనే హృతిక్, సుసానె చెప్పారు. దీంతో ఈ ఇద్దరూ మరోసారి పెళ్లితో ఒక్కటవ్వాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Next Story